iDreamPost

Rohit Sharma: వాళ్లకో దండం.. వారితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ

కపిల్ శర్మ షోలో పాల్గొన్న రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ ఆటగాళ్లతో అస్సలు రూమ్ షేర్ చేసుకోనని చెప్పుకొచ్చాడు. మరి ఆ ప్లేయర్లు ఎవరు?

కపిల్ శర్మ షోలో పాల్గొన్న రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ ఆటగాళ్లతో అస్సలు రూమ్ షేర్ చేసుకోనని చెప్పుకొచ్చాడు. మరి ఆ ప్లేయర్లు ఎవరు?

Rohit Sharma: వాళ్లకో దండం.. వారితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ

ఐపీఎల్ 2024 సీజన్ లో కెప్టెన్సీ పదవిని వదిలేసిన దగ్గర నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మలో ఎంతో మార్పు వచ్చింది. సహచర ఆటగాళ్లతో ఎంతో చలాకీగా, సరదాగా మాట్లాడుతూ.. నవ్వులు పూయిస్తున్నాడు హిట్ మ్యాన్. తాజాగా కపిల్ శర్మ షోలో శ్రేయస్ అయ్యర్ తో కలిసి అలరించాడు రోహిత్. ఈ షోలో కపిల్ శర్మ అడిగిన పలు క్వశ్చన్స్ కు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు. అందులో భాగంగా.. ఓ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ తో గదిని పంచుకోవడం అత్యంత నరకం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ ప్లేయర్లు ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో మళ్లీ ప్రారంభమైంది. ఇక ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ లు వచ్చారు. కపిల్ శర్మ వీరిద్దరి నుంచి చాలా విషయాలను రాబట్టాడు. ఇతర ప్లేయర్లకు సంబంధించిన చిలిపి రహస్యాలను కూడా కొన్నింటిని అభిమానులకు తెలిసేలా చేశాడు. ఇక రోహిత్ ను టూర్లకు వెళ్లినప్పుడు ఏ ప్లేయర్లతో రూమ్ పంచుకుంటావు అని కపిల్ శర్మ అడిగాడు. దానికి రోహిత్ ఆన్సర్ ఇస్తూ..” నాకు ఏ ప్లేయర్ తో రూమ్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినా ఒకే. కానీ శిఖర్ ధావన్, రిషబ్ పంత్ లతో మాత్రం నా జన్మలో రూమ్ షేర్ చేసుకోను. ఎందుకంటే? వాళ్లిద్దరు బట్టలు ఎక్కడపడితే అక్కడ విసిరేస్తారు. అది నాకు అస్సలు నచ్చదు. పైగా వారు రాత్రి ఒంటి గంటకు నిద్రపోతారు” అంటూ తన బాధలు చెప్పుకొచ్చాడు హిట్ మ్యాన్.

కాగా.. తన రూమ్ ఎప్పుడూ DNDలోనే ఉంటుందని రోహిత్ పేర్కొన్నాడు. ధావన్, రిషబ్ ల గది రెండు, మూడు రోజులు అలాగే చిందరవందరగా ఉంటుందని ఎవ్వరికీ తెలియని నిజాలు వెల్లడించాడు. హోటల్స్ లో ప్రతీ ప్లేయర్ కు సపరేట్ రూమ్ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో రూమ్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ విషయానికి వస్తే.. ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో కూడా ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక తన నెక్ట్స్ మ్యాచ్ లో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి.. టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది ఎంఐ టీమ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి