ఆసియా కప్-2023లో ఓటమి అనేలే లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా అనూహ్య ఫలితాన్ని చూసింది. సూపర్-4 దశలో పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలతో ముందే ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్‌కు చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఎదురైంది. ప్రాధాన్యం లేని నామమాత్రపు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చింది టీమిండియా. వాళ్ల ప్లేసులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, ప్రసిద్ధ్ కృష్ణకు టీమ్‌లో ఛాన్స్ ఇచ్చింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు ఇదే తొలి ఇంటర్నేషనల్ వన్డే కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 265 రన్స్ చేసింది. షకిబ్ అల్ హసన్ (80)తో పాటు హృదాయ్ (54), నసూమ్ అహ్మద్ (44) రాణించారు. ఆరంభంలో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు మిడిల్ ఓవర్లలో ఫెయిలయ్యారు. దీంతో 200 పరుగులు చేస్తుందా అనుకున్న బంగ్లా కాస్తా 265 స్కోరు చేసింది. ఛేదనకు దిగిన భారత్ విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. శుబ్‌మన్ గిల్ (121)తో పాటు అక్షర్ పటేల్ (42) గొప్పగా పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. భారత్ 49.5 ఓవర్లలో 259 రన్స్‌కు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు అత్యంత సానుకూలాంశం అంటే గిల్ సెంచరీ అనే చెప్పాలి. ఒకవైపు వికెట్లు పడుతన్నా మొక్కవోని దీక్షతో క్రీజులో నిలిచాడీ యంగ్ బ్యాటర్.
బంగ్లాతో మ్యాచ్‌లో అసాధారణంగా పోరాడిన గిల్.. సంయమనాన్ని ప్రదర్శిస్తూనే వీలైనప్పుడల్లా బౌండరీ కొట్టాడు. అతడు చివరి వరకు క్రీజులో ఉండుంటే గెలుపు భారత్ సొంతమయ్యేది. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న గిల్‌ను జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మెచ్చుకున్నాడు. శుబ్‌మన్ సెంచరీ అద్భుతమన్నాడు. అక్షర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడని.. కానీ మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయాడన్నాడు. గిల్‌కు ఎలా ఆడాలో, తన బలమేంటో తెలుసన్నాడు రోహిత్. గిల్‌ను మెచ్చుకున్న హిట్‌మ్యాన్.. అతడికి ఊహించని బహుమతిని ఇచ్చాడు. సెంచరీ చేశాడు కదా అని గిల్ ప్రాక్టీస్ ఎగ్గొట్టడానికి వీల్లేదని.. శతకం బాదినందుకు అతడికి తాను ఇస్తున్న గిఫ్ట్ ఇదేనని సరదాగా అన్నాడు రోహిత్.
ఇదీ చదవండి: అప్పట్లో సచిన్, ఇప్పుడు గిల్.. భారత్ ఓటమికి అదే కారణమా?
Rohit Sharma said – “There is no optional practice session for Shubman Gill, He is working so hard and that is the reward pay off and he is getting with performance and played brilliantly well”. pic.twitter.com/urmoHu1hXL
— CricketMAN2 (@ImTanujSingh) September 15, 2023