iDreamPost

Rohit Sharma: ఏం మాట్లాడాలన్నా కష్టంగానే ఉంది.. మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు: రోహిత్

  • Published May 19, 2024 | 5:39 PMUpdated May 19, 2024 | 5:39 PM

ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఆ టీమ్ లీగ్ స్టేజ్ నుంచే బయటకు వెళ్లిపోయింది. దీంతో రోహిత్ శర్మ జట్టును వీడాడు. ఈ తరుణంలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఆ టీమ్ లీగ్ స్టేజ్ నుంచే బయటకు వెళ్లిపోయింది. దీంతో రోహిత్ శర్మ జట్టును వీడాడు. ఈ తరుణంలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published May 19, 2024 | 5:39 PMUpdated May 19, 2024 | 5:39 PM
Rohit Sharma: ఏం మాట్లాడాలన్నా కష్టంగానే ఉంది.. మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు: రోహిత్

ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ జర్నీ పూర్తయింది. ఆ టీమ్ లీగ్ స్టేజ్ నుంచే బయటకు వెళ్లిపోయింది. దీంతో రోహిత్ శర్మ జట్టును వీడి వెళ్లిపోయాడు. ఈ సీజన్​లో ఫర్వాలేదనిపించాడు హిట్​మ్యాన్. ఆడిన 14 మ్యాచుల్లో కలిపి 150 స్ట్రైక్ రేట్​తో 417 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తనదైన శైలిలో విధ్వంసక ఇన్నింగ్స్​లు పెద్దగా ఆడలేదు. కానీ కుదిరినప్పుడు తన బ్యాట్ పవర్ చూపించాడు. ఆఖరి లీగ్ మ్యాచ్​లో లక్నో సూపర్ జియాంట్స్ మీద 28 బంతుల్లో 68 పరుగులు చేసి ఫామ్​ను అందుకున్నాడు. ముంబై తరఫున ఈ సీజన్​లో అత్యధిక పరుగులు, బౌండరీలు కొట్టిన ప్లేయర్​గా హిట్​మ్యాన్ నిలిచాడు. టీ20 వరల్డ్ కప్​కు ముందు ఇది టీమిండియాకు సూపర్బ్ న్యూస్ అనే చెప్పాలి.

ఐపీఎల్​లో ముంబై ప్రయాణం ముగిసిపోవడంతో టీమ్​ను వదిలి వెళ్లిపోయాడు రోహిత్. అయితే వెళ్తూ వెళ్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏం మాట్లాడాలన్నా కష్టంగానే ఉందని, తమను కావాలనే టార్గెట్ చేస్తున్నారని అన్నాడు. తమకు ప్రైవసీ లేకుండా పోతోందని వాపోయాడు. ఈ సీజన్​లో కేకేఆర్​తో మ్యాచ్​కు ముందు ఆ టీమ్ కోచింగ్ స్టాఫ్​లో భాగమైన అభిషేక్ నాయర్​తో సరదాగా కాసేపు ముచ్చటించాడు హిట్​మ్యాన్. ముంబై జట్టును తాను బిల్డ్ చేశానని, కానీ ఇప్పుడు దాంతో తనకు సంబంధం లేదని, అంతా ముగిసిందని అన్నాడు. వాళ్ల సంభాషణకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలోకి రావడంతో సంచలనంగా మారింది. ముంబైని రోహిత్ వీడటం పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. దీంతో చాలా బాధపడ్డాడీ ముంబైకర్.

లక్నోతో ఆఖరి మ్యాచ్ టైమ్​లో ధవల్ కులకర్ణితో మాట్లాడుతూ కనిపించాడు రోహిత్. అదే టైమ్​లో కెమెరామెన్ రావడంతో వాయిస్ మ్యూట్ చేయాలంటూ దండం పెట్టాడు. ఈ విషయాలపై తాజాగా హిట్​మ్యాన్ ఓ ట్వీట్ చేశాడు. ‘క్రికెటర్ల జీవితాలు ఇప్పుడు సున్నితంగా మారిపోయాయి. మా చుట్టూ కెమెరాలు తిరుగుతూనే ఉన్నాయి. అడుగడుగునా మమ్మల్ని కవర్ చేస్తున్నాయి. మ్యాచ్ డేస్​లో లేదా ప్రాక్టీస్ సెషన్​లోనో ఫ్రెండ్స్, కొలీగ్స్​తో మాట్లాడేందుకు కూడా మాకు ఛాన్స్ ఉండట్లేదు. క్రికెటర్లకు ప్రైవసీ లేకుండా పోయింది. ఏం మాట్లాడాలన్నా కష్టంగానే ఉంది. నా కన్వర్జేషన్​ను రికార్డు చేయడమే గాక టెలికాస్ట్ కూడా చేశారు. ఎక్స్​క్లూజివ్ కంటెంట్ కోసం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. వ్యూస్ కోసం మాకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఫ్యాన్స్, క్రికెటర్లు, క్రికెట్ మధ్య ఉన్న నమ్మకాన్ని వీళ్లు తెంపేస్తారు’ అంటూ రోహిత్ సీరియస్ అయ్యాడు. మరి.. తమను టార్గెట్ చేస్తున్నారంటూ హిట్​మ్యాన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి