Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 మొదలవడానికి ఇంకో రెండు వారాల టైమ్ కూడా లేదు. ఈ టైమ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బాంబు పేల్చాడు. తాను సరిగ్గా ఆడలేకపోతున్నానని అన్నాడు. హిట్‌మ్యాన్ ఇంకా ఏం చెప్పాడంటే..!
టీ20 వరల్డ్ కప్-2024 మొదలవడానికి ఇంకో రెండు వారాల టైమ్ కూడా లేదు. ఈ టైమ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బాంబు పేల్చాడు. తాను సరిగ్గా ఆడలేకపోతున్నానని అన్నాడు. హిట్‌మ్యాన్ ఇంకా ఏం చెప్పాడంటే..!
Nidhan
రోహిత్ శర్మ.. ఈ ఐపీఎల్ సీజన్ మొదలవడానికి ముందు నుంచే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కెప్టెన్సీ మార్పు వివాదంతో అతడు ఈ సీజన్లో ఆడతాడో లేదనే అనుమానాలు నెలకొన్నాయి. లీగ్ స్టార్ట్ అవడానికి ముందు ఆడనంటూ ట్వీట్ పెట్టి డిలీట్ చేశాడు. దీంతో హిట్‌మ్యాన్ ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై చెప్పేశాడని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు టీమ్‌తో జాయిన్ అయ్యాడు రోహిత్. పాండ్యా గ్రూప్‌కు దూరంగా ఉంటూ ఒంటరిగా ప్రాక్టీస్ చేశాడు. కెప్టెన్సీ పోవడంతో అతడు బ్యాటర్‌గా ఏం చేస్తాడని అంతా ఎదురుచూశారు. అభిమానులు ఆశించిన స్థాయిలో కాకపోయినా అతడి బ్యాట్ బాగానే గర్జించింది. ఐపీఎల్-2024లో ముంబై తరఫున అత్యధిక పరుగులు, బౌండరీలు, సిక్సులు బాదింది రోహితే కావడం విశేషం.
ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచుల్లో 150 స్ట్రైక్ రేట్‌తో 417 పరుగులు చేశాడు రోహిత్. అతడి ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది. నిన్న లక్నో సూపర్ జియాంట్స్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 68 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ముంబై వరుస మ్యాచుల్లో ఓడినా హిట్‌మ్యాన్ బ్యాటింగ్ చూసేందుకు వేలాదిగా స్టేడియాలకు పోటెత్తారు ఫ్యాన్స్. వాళ్లను అతడు నిరాశపర్చలేదు. అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతూ వచ్చాడు. కానీ ఈ విషయాన్ని హిట్‌మ్యాన్ ఒప్పుకోవడం లేదు. అభిమానులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాలను నిలబెట్టుకోలేకపోయానని బాధపడుతున్నాడు. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాను అంటూ వరల్డ్ కప్ ముందు బాంబు పేల్చాడు. అనుకున్నంత స్థాయిలో తాను రాణించలేకపోయానంటూ తన పెర్ఫార్మెన్స్ మీద అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే దీని గురించి అతిగా ఆలోచించడం మంచిది కాదన్నాడు రోహిత్.
‘ఒక బ్యాట్స్‌మన్‌గా నేను అంచనాలను అందుకోలేకపోయాననే విషయం నాకు తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఆడటం వల్ల ఒకటి మాత్రం నేర్చుకున్నా. సరిగా ఆడలేదని బాధపడుతూ కూర్చున్నా, అతిగా ఆలోచించినా మున్ముందు మ్యాచుల్లో బాగా ఆడలేం. అందుకే పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తుంటా. మంచిగా ఆలోచిస్తూ, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసేందుకు ట్రై చేస్తా. నా బ్యాటింగ్‌లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏ విషయంలో తప్పులు చేస్తున్నానో అర్థం చేసుకొని వాటిని సరిదిద్దుకుంటా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. హిట్‌మ్యాన్ వ్యాఖ్యలు విన్న ఫ్యాన్స్ అతడు బాగానే ఆడాడని, టీమ్‌లోని ఇతర ఆటగాళ్లతో పోలిస్తే రోహిత్ చాలా బెటర్ అని అంటున్నారు. మరి.. ఐపీఎల్-2024లో హిట్‌మ్యాన్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma said “As a batter, I know I didn’t live up to the standard but after playing for all these years, I know that if I overthink, I won’t play well. All I try is to stay in a good mindset, right zone, keep practicing & improve on all the flaws in my game”. [JioCinema] pic.twitter.com/bgtZhYdpBh
— Johns. (@CricCrazyJohns) May 18, 2024