iDreamPost

Rohit Sharma: గిల్‌ తనను రనౌట్‌ చేయడంపై స్పందించిన రోహిత్‌! ఏమన్నాడో చూడండి..

  • Published Jan 12, 2024 | 9:40 AMUpdated Jan 12, 2024 | 9:40 AM

Rohit Sharma, Shubman Gill: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆఫ్ఘాన్‌తో తొలి టీ20లో రనౌట్‌ అయ్యాడు. అందుకు గిల్‌ కారణమంటూ అంతనిపై గ్రౌండ్‌లోనే కేకలు వేశాడు. మ్యాచ్‌ తర్వాత కూడా గిల్‌ గురించి మాట్లాడు రోహిత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మరి రోహిత్‌ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Shubman Gill: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆఫ్ఘాన్‌తో తొలి టీ20లో రనౌట్‌ అయ్యాడు. అందుకు గిల్‌ కారణమంటూ అంతనిపై గ్రౌండ్‌లోనే కేకలు వేశాడు. మ్యాచ్‌ తర్వాత కూడా గిల్‌ గురించి మాట్లాడు రోహిత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మరి రోహిత్‌ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 12, 2024 | 9:40 AMUpdated Jan 12, 2024 | 9:40 AM
Rohit Sharma: గిల్‌ తనను రనౌట్‌ చేయడంపై స్పందించిన రోహిత్‌! ఏమన్నాడో చూడండి..

మొహాలీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో భారత్‌ ముందంజలో ఉంది. కాగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. మ్యాచ్‌లో జరిగిన ఒక సంఘటన మాత్రం భారత క్రికెట్‌ అభిమానులకు కోపం తెప్పించింది. అదేంటంటే.. రోహిత్‌ శర్మ రనౌట్‌. దాదాపు ఏడాది కాలం తర్వాత రోహిత్‌ టీ20 క్రికెట్‌ ఆడుతున్నాడు. దీంతో ఆఫ్ఘాన్‌తో తొలి మ్యాచ్‌లో ఎలా ఆడతాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో రోహిత్‌ శర్మ అదరగొడతాడని అంతా భావించారు. కానీ, దురదృష్టవశాత్తు రోహిత్‌ పరుగులేమీ చేయకుండానే రనౌట్‌ అయ్యాడు. అది కూడా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తప్పిదంతో.

దీంతో భారత క్రికెట్‌ అభిమానులు గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ శర్మ సైతం అవుట్‌ కాగానే.. గిల్‌పై కోపం వ్యక్తం చేస్తూ పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక గిల్‌కు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిన తర్వాత గట్టి క్లాస్‌ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ తన రనౌట్‌పై స్పందిస్తూ.. తన పెద్దరికం చాటుకున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘శుబ్‌మన్‌ గిల్‌ బాగా ఆడాలని కోరుకున్నానని, గేమ్‌లో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయని, అయితే.. గిల్‌ ఒక మంచి చిన్న ఇన్నింగ్‌ ఆడాడు. మొత్తం జట్టు మ్యాచ్‌ గెలవడమే ఇంపార్టెంట్‌’ అంటూ రోహిత్, గిల్‌ను మెచ్చుకున్నాడు. దీంతో రోహిత్‌, గిల్‌ను క్షమించినట్లు అంతా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు.

Rohit's comment on Gill's mistake!

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగుల మంచి స్కోర్‌ చేసింది. ఆఫ్ఘాన్‌ టాపార్డర్‌ బ్యాటర్లు గుర్బాజ్‌(23), ఇబ్రహీం జద్రాన్‌(25), అజ్మతుల్లా(29) పర్వాలేదనిపించారు. చివర్లో నబీ 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, ముఖేష్‌ కుమార్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శివమ్‌ దూబే ఒక వికెట్‌ తీశాడు. ఇక 159 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. గిల్‌(23), తిలక్‌ వర్మ(26), జితేష్‌ కుమార్‌(31) పర్వాలేదనిపంచారు. శివమ్‌ దూబే 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 60 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో రింకూ సింకూ 9 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరి తనను రనౌట్‌ చేసిన గిల్‌ విషయంలో రోహిత్‌ పాజిటివ్‌గా స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి