SNP
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత సెటైరికల్‌గా మాట్లాడాతాడో చాలా మందికి తెలియదు. అర్థం కాని పంచులు చాలా ఉంటాయ్ అతని స్పీచ్‌లో. తాజాగా అలాంటి ఓ ఆసక్తికర వ్యాఖ్యతో మరోసారి రోహిత్ ట్రెండ్ అయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యువ టీమిండియా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతుండగా.. రోహిత్, కోహ్లీ మరికొంతమంది సీనియర్లు టీ20లకు దూరంగా ఉండి.. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌కు సిద్ధం అవుతున్నారు. దొరికిన ఈ కాస్త గ్యాప్‌లో రోహిత్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడున్న వ్యక్తుల నుంచి ఎదురైన ప్రశ్నలకు రోహిత్ సమాధానాలు ఇచ్చాడు. వాటిలో ఒకటి పాకిస్థాన్ గురించి కూడా ఎదురైంది. దానికి రోహిత్ తనదైన స్టైల్‌లో బదులిచ్చి నవ్వులు పూయించాడు.
ఇంతకీ రోహిత్‌కు ఎందురైన ప్రశ్న ఏంటి? దానికి అతను చెప్పిన సమాధానం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అయితే చదవండి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి మీకు ఇప్పుడున్న పాకిస్థాన్ బౌలర్లలో ఏ బౌలర్ టఫ్‌గా అనిపిస్తాడు? అని అడగ్గా.. దానికి రోహిత్ బదులిస్తూ.. పాకిస్థాన్ టీమ్‌లో అందరూ మంచి బౌలర్లే. కానీ, నేను వాళ్ల పేర్లు చెప్పను. పేర్లు చెబితే అదో పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. అలాగే ఒకరి పేరు చెబితే మరొకరికి నచ్చదు అందుకే ఒకరని చెప్పలేను కానీ, అంతా మంచి బౌలర్లే ఉన్నారని రోహిత్ సెటైరికల్‌గా నవ్వులు పూయించాడు. ప్రస్తుతం రోహిత్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. వచ్చే నెలలో పాకిస్థాన్‌తో టీమిండియా ఆసియా కప్ 2023లో తలపడనుంది. శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ పోటీల్లో భారత్-పాక్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదట ఆసియా కప్ 2023 పాకిస్థాన్‌లోనే జరగాల్సి ఉన్నా.. టీమిండియా పాక్ వెళ్లని కారణంగా ఆసియా కప్ వేదికలను విభజించారు. కొన్ని మ్యాచ్‌ల పాకిస్థాన్‌లో, కొన్ని శ్రీలంకలో నిర్వహించనున్నాడు. అయితే.. టీమిండియా ఆడే అన్ని మ్యాచ్‌లు పాక్ బయటే జరగనున్నాయి. అయితే.. ఈ టోర్నీలో పాకిస్థాన్ బౌలర్లను టీమిండియా ఎదుర్కొనే తీరుపైనే వన్డ్ వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలు కూడా ఆధారపడి ఉన్నాయని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. రోహిత్ చెప్పకపోయినా.. పాక్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ పాక్‌లో ప్రమాదకర బౌలర్‌గా ఉన్నాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Coach Sab dar kiun rahe he lelen name😂💯.#RohitSharma pic.twitter.com/l0aH3joSgQ
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) August 7, 2023
ఇదీ చదవండి: బాబర్ అజమ్ సెంచరీపై లంక తప్పడు ప్రచారం! మరీ ఇంత అబద్ధమా?