ఆసియా కప్ 2023లో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నారు. ఒకరు కాకుంటే.. మరొకరు ఈ రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే ఈ టోర్నీలో పలు రికార్డులను బ్రేక్ చేశారు టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు. ఈ నేపథ్యంలోనే హిట్ మ్యాన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. దీంతో బంగ్లా బ్యాటర్లు పెవిలియన్ కు ఒకరివెంట ఒకరు క్యూ కట్టారు. అయితే కెప్టెన్ షకీబ్(80), తౌహిత్ హ్రిడోయ్(54) పరుగులతో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పోరాడదగ్గ స్కోర్ ను నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ బౌలింగ్ లో మెహిది హసన్ మీరజ్ క్యాచ్ అందుకున్నాడు రోహిత్.
ఈ క్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో 200 క్యాచ్ ల మార్క్ ను అందుకున్నాడు రోహిత్ భాయ్. వన్డేల్లో రోహిత్ కు ఇది 91వ క్యాచ్ కాగా.. ఇంతకు ముందు 34 మంది ఈ ఘనతను అందుకున్నారు. ఇక 449 మ్యాచ్ ల్లో రోహిత్ 200 క్యాచ్ లు అందుకుని రికార్డు నెలకొల్పాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక(కీపర్ కాకుండా) క్యాచ్ లు పట్టిన రికార్డు శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే పేరిట ఉంది. అతడు 652 మ్యాచ్ ల్లో మెుత్తం 440 క్యాచ్ లు అందుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్ లో రోహిత్ కంటే ముందు.. రాహుల్ ద్రవిడ్(334), కోహ్లీ(303), సచిన్(256) ఉన్నారు.
Most catches by active fielders:
– Virat Kohli – 303
– Steve Smith – 288
– Joe Root – 280
– David Warner – 203
– Rohit Sharma – 200*. pic.twitter.com/7UPqbB4yFw— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2023