iDreamPost

వీడియో: మరోసారి వాటర్ బాయ్ గా మారిన కోహ్లీ! అక్షయ్ కుమార్ లా ఉరుకుతూ..

  • Author Soma Sekhar Published - 06:08 PM, Fri - 15 September 23
  • Author Soma Sekhar Published - 06:08 PM, Fri - 15 September 23
వీడియో: మరోసారి వాటర్ బాయ్ గా మారిన కోహ్లీ! అక్షయ్ కుమార్ లా ఉరుకుతూ..

విరాట్ కోహ్లీ.. క్రీజ్ లో ఉంటే ముచ్చటగొలిపే కవర్ డ్రైవ్స్, టైమింగ్ సిక్స్ లతో అదరగొడతాడు. అదే గ్రౌండ్ లో ఉంటే.. ఇక ఎంటర్ టైన్ మెంట్ కు కొదవేఉండదు. కళ్లు చెదిరే క్యాచ్ లకు తోడు.. డ్యాన్స్ లు, క్రేజీ స్టెప్పులు వేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంటాడు. ఇక అప్పుడప్పుడు వాటర్ బాయ్ గా మారి అతడు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్ లో మరోసారి వాటర్ బాయ్ గా అవతారం ఎత్తాడు రన్ మెషిన్. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ లా రన్నింగ్ చేస్తూ.. గ్రౌండ్ లోకి పరిగెత్తుకొచ్చాడు విరాట్. ప్రస్తుతం ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది.

విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ చేస్తున్నా, ఫీల్డింగ్ చేస్తున్నా, డగౌట్ లో ఉన్నా తన హుషారుతో తోటి ఆటగాళ్లతో పాటుగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతూ ఉంటాడు. ఇక ఫీల్డింగ్ చేసే క్రమంలో తనదైన స్టెప్పులతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో మరోసారి వాటర్ బాయ్ గా అవతారం ఎత్తాడు కింగ్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్ లో బంగ్లా ప్లేయర్ అనముల్ హక్ అవుట్ అయిన తర్వాత.. కోహ్లీ తన టీమ్మెట్స్ కోసం వాటర్ బాటిళ్ల బ్యాగ్ పట్టుకుని పరిగెత్తుకొచ్చాడు. అతడు పరిగెత్తిన తీరు చాలా సరదాగా ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా.. విరాట్ పరిగెత్తిన తీరు ‘పేరా పేరీ’ సినిమాలో హీరో అక్షయ్ కుమార్ పరిగెత్తినట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సిరాజ్ తో కలిసి అతడు వాటర్ బాటిళ్లు తీసుకొచ్చాడు. కాగా.. విరాట్ కోహ్లీ గత 8 వన్డే మ్యాచ్ ల్లో వాటర్ బాయ్ గా మారడం ఇది మూడోసారి కావడం గమనార్హం. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టును టీమిండియా బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ప్రస్తుతం 42 ఓవర్లకు 7 వికెట్లకు 193 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(80), తౌహిత్ హ్రిడోయ్(54) పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, షమీ 2 వికెట్లు తీసి సత్తా చాటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి