iDreamPost
android-app
ios-app

కుల్దీప్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 04:32 PM, Mon - 30 October 23

ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఆగ్రహానికి బలైయ్యాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. గతంలో చాలా మంది ప్లేయర్లు రోహిత్ కోపాన్ని చవిచూడగా.. తాజాగా ఈ లిస్ట్ లో చేరాడు కుల్దీప్. మరి రోహిత్ కోపానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఆగ్రహానికి బలైయ్యాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. గతంలో చాలా మంది ప్లేయర్లు రోహిత్ కోపాన్ని చవిచూడగా.. తాజాగా ఈ లిస్ట్ లో చేరాడు కుల్దీప్. మరి రోహిత్ కోపానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 04:32 PM, Mon - 30 October 23
కుల్దీప్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ! వీడియో వైరల్..

లక్నో వేదికగా ఏక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ, గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట.. రాహుల్, సూర్యలతో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో రోహిత్ ఆగ్రహానికి బలైయ్యాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. గతంలో చాలా మంది ప్లేయర్లు రోహిత్ కోపాన్ని చవిచూడగా.. తాజాగా ఈ లిస్ట్ లో చేరాడు కుల్దీప్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోహిత్ శర్మ.. ఇటు కెప్టెన్ గా, అటు ఓపెనర్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక ఈ రెండు పాత్రలను మోస్తుండటంతో.. అప్పుడప్పుడు గ్రౌండ్ లో కాస్త సహనం కోల్పోతూ ఉంటాడు రోహిత్. గతంలో శార్దూల్, రాహుల్ తో పాటుగా మరికొందరిపై తన కోపాన్ని ప్రదర్శించడం మనం చూసే ఉన్నాం. తాజాగా రోహిత్ కోపానికి బలైయ్యాడు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ కు చీవాట్లు పెట్టాడు రోహిత్. ఆ వివరాల్లోకి వెళితే.. 22వ ఓవర్ లో కుల్దీప్ వేసిన ఓ బాల్ నేనుగా ఇంగ్లాండ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ ప్యాడ్లను తాకింది. దీంతో కీపర్ రాహుల్, కుల్దీప్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు.

అయితే రివ్యూ వెళ్లే విషయమై కుల్దీప్ కాన్ఫిడెంట్ గా లేడు. అతడు ఇదే విషయాన్ని రోహిత్ కూడా చెప్పాడు. దీంతో రోహిత్ రివ్యూ తీసుకోలేదు. అయితే ఆ తర్వాత రిప్లేలో చూడగా.. బంతి వికెట్లను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. రివ్యూ కోరితే లివింగ్ స్టోన్ అప్పుడే అవుట్ అయ్యేవాడు. అదీకాక అప్పటికే టీమిండియా వద్ద రెండు రివ్యూలు ఉన్నాయి. ఇక ఇది చూసిన రోహిత్ కు కోపం వచ్చింది. మైండ్ దొబ్బిందా? అంటు గట్టిగా అరిచినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో రోహిత్ తీవ్ర అసహనంలో ఉన్నాడు. రోహిత్ అలా గట్టిగా అరవడంతో.. పాపం కుల్దీప్ మెుఖం చిన్నబుచ్చుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

కాగా.. గత కొంతకాలంగా రోహిత్ శర్మ గ్రౌండ్ లో సహనం కోల్పోయి.. ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకుంటున్న సంఘటనలు ఎక్కువైతున్నాయి. ఈ పద్ధతి మంచి కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు సగటు క్రికెట్ ప్రేమికులు. అయితే ఈ మ్యాచ్ లో లివింగ్ స్టోన్ తక్కువ పరుగులకే అవుటైయ్యాడు కాబట్టి, టీమిండియా విజయం సాధించడం చేత ఎవరూ దీనిని పెద్దగా పట్టించుకోవట్లేదు. అదే లివింగ్ స్టోన్ రెచ్చిపోయి, మ్యాచ్ ఓడిపోయుంటే ఎలా ఉండేదని మరికొందరు నెటిజన్లు రోహిత్ కు సపోర్టు గా కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ మైదానంలో గొడవలు జరిగితే.. జట్టులోని మిగతా సభ్యులు కూడా ఏకాగ్రతను కోల్పోవడం జరిగి.. మ్యాచ్ పై ప్రభావం చూపిస్తుందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.