iDreamPost
android-app
ios-app

Rohit Sharma: కుర్రాళ్లకు ట్రైనింగ్‌ ఇవ్వనున్న రోహిత్‌ శర్మ! అకాడమీ ప్రారంభం.. ఎక్కడంటే?

  • Published Dec 30, 2023 | 3:08 PM Updated Updated Dec 30, 2023 | 3:08 PM

రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ అకాడమీని డిసెంబర్ 29న ప్రారంభించారు. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ అకాడమీని ముంబైలో స్టార్ట్ చేయలేదు. ఇంతకీ ఎక్కడ ప్రారంభించారో తెలుసా?

రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ అకాడమీని డిసెంబర్ 29న ప్రారంభించారు. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ అకాడమీని ముంబైలో స్టార్ట్ చేయలేదు. ఇంతకీ ఎక్కడ ప్రారంభించారో తెలుసా?

Rohit Sharma: కుర్రాళ్లకు ట్రైనింగ్‌ ఇవ్వనున్న రోహిత్‌ శర్మ! అకాడమీ ప్రారంభం.. ఎక్కడంటే?

సాధారణంగా క్రికెటర్లు తమ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్లుగా, కోచ్ లుగా సేవలు అందిస్తూ ఉంటారు. ఇక మరికొంత మంది క్రికెట్ అకాడమీలు పెట్టి దేశంలో ఉన్న యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే దేశంలో ఎన్నో అకాడమీలు ఉన్నాయి. తాజాగా మరో క్రికెట్ అకడమీ ప్రారంభం అయ్యింది. రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ అకాడమీని డిసెంబర్ 29న ప్రారంభించారు. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ అకాడమీని ముంబైలో స్టార్ట్ చేయలేదు. ఇంతకీ ఎక్కడ ప్రారంభించారో తెలుసా?

రోహిత్ శర్మ.. వరల్డ్ కప్ తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్ లో ఘోరంగా విఫలం అయ్యాడు. దీంతో అతడిపై సర్వత్రా విమర్శలు కురిపిస్తున్నారు నెటిజన్లు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగాడు రోహిత్. టీమిండియా బ్యాటర్లు అంతా విఫలం అవ్వడంతో ఈ టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. అన్ని హంగులతో కూడిన రోహిత్ శర్మ క్రికెట్ అకాడమీని డిసెంబర్ 29న ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ లోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ ఒరైలో రోహిత్ శర్మ అకాడమీ ప్రారంభం అయ్యింది. ఇది యంగ్ క్రికెటర్లకు ఓ సువర్ణావకాశం లాంటిది. ఎంతో మంది యువ క్రికెటర్లకు సరైన సదుపాయాలు, గ్రౌండ్స్, అకాడమీలు లేక తమ ఆటను మధ్యలోనే ముగిస్తున్నారు. అలాంటి వారికి ఇలాంటి అకాడమీలు చేయూతనిస్తాయని అంటున్నారు క్రీడా నిపుణులు. కాగా.. రోహిత్ ఖాళీ సమయాల్లో ఇక్కడి వచ్చి, తన అనుభవాలను యువ ప్లేయర్లతో పంచుకోనున్నాడు. అయితే గతంలో యూఏఈలో ఓ అకాడమీని రోహిత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2024 టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఈ అకాడమీని ప్రారంభించానని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.