iDreamPost

Mumbai Indians: అంతకంతా పగ తీర్చుకుంటున్నారు.. ముంబైని వదలని రోహిత్ ఫ్యాన్స్!

  • Published Dec 17, 2023 | 3:44 PMUpdated Dec 17, 2023 | 3:44 PM

కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా ముంబై ఇండియన్స్​ను రోహిత్ శర్మ అభిమానులు వదలడం లేదు. ఆ ఫ్రాంచైజీపై ఒక రేంజ్​లో తమ రివేంజ్ తీర్చుకుంటున్నారు.

కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా ముంబై ఇండియన్స్​ను రోహిత్ శర్మ అభిమానులు వదలడం లేదు. ఆ ఫ్రాంచైజీపై ఒక రేంజ్​లో తమ రివేంజ్ తీర్చుకుంటున్నారు.

  • Published Dec 17, 2023 | 3:44 PMUpdated Dec 17, 2023 | 3:44 PM
Mumbai Indians: అంతకంతా పగ తీర్చుకుంటున్నారు.. ముంబైని వదలని రోహిత్ ఫ్యాన్స్!

ఫ్రాంచైజీలకు పాపులారిటీ రావాలంటే కేవలం ప్లేయర్స్ వల్లే సాధ్యం. టీమ్ గెలుపుతో పాటు బ్రాండ్ ఇమేజ్ బిల్డింగ్​లో క్రికెటర్లదే కీలక పాత్ర. అందుకే ఆక్షన్​లో రూ.కోట్లకు రూ.కోట్లు పోసి స్టార్ ప్లేయర్లను కొనుక్కుంటాయి ఫ్రాంచైజీలు. ఆటగాళ్లకు ఉండే అభిమాన గణం కారణంగానే టీమ్స్​కు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. దీని పైనే వాటి ఆదాయం కూడా ఆధారపడుతుంది. మంచి పాపులారిటీ, ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజీల కోసం స్పాన్సర్లు ఎగబడతారు. అందుకే ప్లేయర్ల ఫ్యాన్స్​ను కూడా టీమ్స్ దృష్టిలో పెట్టుకుంటాయి. అయితే తమ అభిమాన ఆటగాళ్లతో సరిగా బిహేవ్ చేయకపోయినా, వారిని అవమానించినా ఫ్యాన్స్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శల్ని ఎదుర్కోక తప్పదు. అప్పటిదాకా ఆదరించిన వారే ఎదురుదాడికి దిగుతారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. రోహిత్​ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేసిన ముంబైపై అతడి అభిమానులు రివేంజ్ తీర్చుకుంటున్నారు.

కష్టాల్లో ఉన్న టీమ్​ను నిలబెట్టి అద్భుతమైన బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్​తో 5 ట్రోఫీలు అందిస్తే రోహిత్​ను ముంబై అవమానించడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. లక్షలాది మంది హిట్​మ్యాన్ అభిమానులు ఎంఐ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. పాపులర్ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ అయిన ఇన్​స్టాగ్రామ్​లో ఇప్పటిదాకా 9 లక్షల మంది ముంబైని అన్​ఫాలో చేశారు. రోహిత్ కెప్టెన్సీ తొలగింపు అనౌన్స్​మెంట్ రాకముందు వరకు ఇన్​స్టాలో ఎంఐకి 13.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 12.4 మిలియన్లకు తగ్గింది. మరో సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ అయిన ట్విట్టర్​లో దాదాపు 5 లక్షల మంది ముంబైని అన్​ఫాలో చేశారు. ఈ రెండు ప్లాట్​ఫామ్స్​ను కలిపి దాదాపుగా 14 లక్షల మంది ఆ టీమ్​కు షాకిచ్చారు.

ముంబైకి ఫ్యాన్స్​ షాకివ్వడానికి రోహిత్​తో ఆ ఫ్రాంచైజీ వ్యవహరించిన తీరే కారణం. హిట్​మ్యాన్​తో గౌరవప్రదంగా వ్యవహరించి కెప్టెన్సీ నుంచి తొలగిస్తే సరిపోయేది. ప్రస్తుత ఫామ్, ఫిట్​నెస్​ ప్రకారం మరో మూడ్నాలుగేళ్లు ఆడే సత్తా రోహిత్​కు ఉంది. ఈ నేపథ్యంలో కనీసం మరో ఏడాది పాటు అతడి సారథ్యంలోనే హార్దిక్ పాండ్యాను కూడా ఆడించాల్సింది. ఆ తర్వాత సాఫీగా సారథ్య బాధ్యతలు బదిలీ చేసి ఉంటే బాగుండేది. కానీ హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పించడం, తాము ఏం చెబితే అదే ఫైనల్ అనేలా అహంకారంతో ముంబై ప్రవర్తించడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఫ్రాంచైజీపై తమ కోపం, అసహనం, అసంతృప్తిని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ముంబై అకౌంట్స్​ను అన్​ఫాలో చేయడమే గాక ఆ జట్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇదంతా చూస్తుంటే ముంబై కెప్టెన్సీ కాంట్రవర్సీ ఇప్పట్లో ముగిసేలా లేదు. వచ్చే సీజన్​లోనూ హిట్​మ్యాన్ ఫ్యాన్స్ నుంచి ఎంఐకి తీవ్ర వ్యతిరేకత తప్పకపోవచ్చు. మరి.. ముంబైని రోహిత్ ఫ్యాన్స్ వదలకపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: ముంబైలోనే రోహిత్.. ఫ్రాంచైజీ మారకుండా అడ్డుపడుతోంది అదే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి