iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion : హీరో ప్రేమించిన అమ్మాయి.. అతడి స్నేహితుడితో! లవ్ స్టోరీ కాదు రివేంజ్ డ్రామా!

  • Published May 21, 2024 | 6:50 PMUpdated May 21, 2024 | 6:50 PM

రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు.. రెగ్యులర్ గా జరిగే సిట్యుయేషన్స్ తో ఓ డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ కథను తెరపైన చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే.

రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు.. రెగ్యులర్ గా జరిగే సిట్యుయేషన్స్ తో ఓ డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ కథను తెరపైన చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే.

  • Published May 21, 2024 | 6:50 PMUpdated May 21, 2024 | 6:50 PM
OTT Movie Suggestion : హీరో ప్రేమించిన అమ్మాయి.. అతడి స్నేహితుడితో! లవ్ స్టోరీ కాదు రివేంజ్ డ్రామా!

ఓటీటీ వరల్డ్ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటిలో మూవీ లవర్స్ కొన్ని సినిమాలను చూడడం మిస్ చేసే అవకాశం ఉంది. అటువంటి వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. హారర్, రొమాన్స్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ సినిమా ఓ డిఫ్ఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాలో రెగ్యులర్ గా చూసే సిట్యుయేషన్స్ ఏ కనిపించినా.. ఎండింగ్ మాత్రం చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కొన్ని సినిమాలు కథ పరంగా ఎంతో ఆసక్తిగా ఉన్నా సరే .. స్టార్ క్యారెక్టర్స్ లేకపోవడంతో ఆ సినిమాలు పెద్దగా పాపులర్ అవ్వవు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. గీతానంద్, నేహా సోలంకి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా “గేమ్ ఆన్”. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా అయినా కూడా ఎందుకో అంత పాపులర్ అవ్వలేకపోయింది. ఈ సినిమా ఫిబ్రవరి 2 థియేటర్ లో రిలీజ్ అయింది. కథ పరంగా ఈ సినిమా బాగున్నా కూడా స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వలన అంతగా బజ్ వినిపించలేదు. థియేటర్ లో విడుదలైన కొద్దీ రోజులకే ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయినప్పటికీ.. ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటివరకు ఇలాంటి సినిమాను మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాను ఎందుకు చూడాలి. ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే..

ఈ సినిమా కథేంటంటే.. తనను తానూ లూజర్ అనుకుని ఫీల్ అవుతూ ఉంటాడు సిద్దార్ధ్ అనే వ్యక్తి. తానూ గేమ్ లూప్ అనే కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వలన ఆ కంపెనీలో అతని జాబ్ పోతుంది . సరిగ్గా అదే అదే సమయంలో సిద్ధార్ధ్ జీవితంలో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, సిద్ధార్ధ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అతనిని మోసం చేస్తారు. దానితో మరింత కృంగిపోయి చనిపోవాలని అనుకుంటాడు సిద్ధార్ధ్. కట్ చేస్తే సిద్ధార్ధ్ కు ఓ ఆఫర్ వస్తుంది. కొన్ని టాస్క్ లను చేస్తే.. డబ్బులు ఇస్తామని ఎవరో అజ్ఞాత వ్యక్తి చెప్తాడు. అలానే మొదటి టాస్క్ పూర్తి చేసి డబ్బులు సంపాదిస్తాడు. ఆ తర్వాత అతనికి ఓ వ్యక్తిని చంపాలనే టాస్క్ వస్తుంది, అక్కడినుంచి అతని జీవితం మరింత ప్రశ్నర్ధకంగా మారుతుంది. అసలు ఆ మర్డర్ చేయమన్న వ్యక్తి ఎవరు ? ఎవరిని చంపాలి ? అతని స్నేహితుడు, లవర్ చేసిన మోసం ఏంటి ? చివరికి ఈ కథ ఎలా ముగుస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి