iDreamPost
android-app
ios-app

Best Horror Movie In OTT: రవిబాబు తీసే దెయ్యం సినిమాలు ఇష్టమా? మరి.. OTTలో దీన్ని ఎలా మిస్ అయ్యారు?

  • Published May 21, 2024 | 6:57 PMUpdated May 21, 2024 | 6:57 PM

OTT Movie Suggestion: హారర్ సినిమాలంటే కేవలం హాలీవుడ్ మేకర్స్ మాత్రమే బాగా తీస్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తెలుగులో కూడా ఇంకా చాలానే హర్రర్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఓ తెలుగు హార్రర్ సినిమా గురించే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

హర్రర్ మూవీస్ అంటే కేవలం హాలీవుడ్ వాళ్ళు మాత్రమే బాగా చూపించగలరు అనుకునే టైమ్ లో.. తెలుగులో కూడా మంచి హారర్ కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించవచ్చని నిరూపించారు కొంతమంది దర్శకులు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్నో హార్రర్ వెబ్ సిరీస్ లు, సినిమాలు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు వస్తున్న సినిమాలను , సిరీస్ లను ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. హార్రర్ సస్పెన్స్ జోనర్ లో వచ్చిన ఈ తెలుగు సినిమాను కనుక ఇప్పటివరకు చూడకపోతే ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ముందు ఈ తెలుగు హర్రర్ సినిమా కథేంటో చూసేద్దాం.. ఈ సినిమా కథేంటంటే.. రాజ్ , లీనా అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉంటారు. వారిద్దరూ కూడా ఆస్తమా బారిన పడతారు. రాజ్ నిర్లక్ష్యం కారణంగా.. అతని పెద్ద కూతురు చనిపోతుంది. దీనితో ఆ బాధను తట్టుకోలేక ఆ ఇంటి నుంచి మరో ఇంటికి మారుతారు. అయితే అక్కడకు వెళ్లిన దగ్గరనుంచి తన చిన్న కూతురు మున్ని విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు ఎదో ఒక ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది. రోజు రోజుకి తన ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ ఆత్మ తనని ఇంటి నుంచి బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు మున్ని కనిపించకుండా పోతుంది. మున్ని ఎక్కడకు వెళ్ళింది ? తనను ఆ ఆత్మే బయటకు తీసుకుని వెళ్లిందా ? అసలు ఇంతకీ ఆ ఆత్మ ఎవరిదీ ? ఆ ఆత్మ వలన మున్నీకి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా ? చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మరెవరో కాదు. మరావతి, అనసూయ, అవును లాంటి థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను అఆకట్టుకున్న దర్శకుడు రవి బాబు. తెలుగులో ఇలాంటి కథలను రూపొందించడం కేవలం రవి బాబుకు మాత్రమే సాధ్యం. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ను మెచ్చే ప్రేక్షకులను ఈ సినిమా ఈజీగా మెప్పించేస్తుంది. ఇంతకీ ఈ సినిమా పేరేంటంటే “ఆవిరి”. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి