iDreamPost
android-app
ios-app

Anchor Shyamala: తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల ఫైర్.. వారిపై పరువు నష్టం దావా!

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీకి శ్యామల మద్దతుగా నిలిచారు. తాజాగా మరోసారి ఆమె ఓ ఇష్యూపై వార్తల్లోకి వచ్చారు.

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీకి శ్యామల మద్దతుగా నిలిచారు. తాజాగా మరోసారి ఆమె ఓ ఇష్యూపై వార్తల్లోకి వచ్చారు.

Anchor Shyamala: తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల ఫైర్.. వారిపై పరువు నష్టం దావా!

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీకి శ్యామల మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరుఫున ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే ఆమె వైసీపీకి సపోర్టు చేసిన దగ్గర నుంచి కూడా ఓ వర్గం శ్యామలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. టీడీపీ, జనసేనకు సంబంధించిన కొందరు శ్యామల వ్యక్తిగత జీవితంపై కూడా చేశారు. అయితే వారి విమర్శలను శ్యామల ధీటుగానే ఎదుర్కొన్ని అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూలోకి కొందరు శ్యామల పేరును ప్రస్తావించారు. ఇక తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై శ్యామల సీరియస్ అయ్యారు. పరువు నష్ట దావాకూడా వేశారు.

బెంగళూరులో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఆ పార్టీలో సినీ , రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం. మొత్తం వంద మందికి పైగా పాల్గొనగా..వారిలో 70 మంది పురుషులు, 30 మహిళలు ఉన్నారు. వీరందరు ఏపీ, తెలంగాణం, పాండిచ్చేరికి చెందిన వారని సమాచారం. ఇక ఈ ఇష్యూలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో శ్రీకాంత్, నటి హేమ, జానీ మాస్టర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే తాను ఆ పార్టీలో లేనని శ్రీకాంత్ ప్రకటించారు. అలానే హేమ కూడా తాను ఆ పార్టీలో పాల్గొనలేదని ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇక వీరి ముగ్గురి పేర్లతో పాటు సడన్‌గా యాంకర్ శ్యామల ఉందంటూ  ఓ వర్గం మీడియాలో వార్తలు వెలిశాయి. రేవ్ పార్టీలో పట్టుపడ్డ ప్రముఖ యాంకర్ అంటూ ఓ వర్గం మీడియాలో ప్రచారం చేశారు.

ఓ ఆడపిల్లపై ఇలాంటి విష ప్రచారం చేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. శ్యామలపై కావాలనే బురద జల్లుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. శ్యామలపై ఓవర్గం కావాలనే ఈ విధంగా కుట్ర చేస్తున్నారని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు శ్యామలకు మద్దతుగా నిలిచారు. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై శ్యామల స్పందించారు. తన గురించి తెలియని, నిజా నిజాలు తెలియకుండా రాసినందుకు పరువు నష్ట దావా వేశానని శ్యామల తెలిపారు.  ముందు వెనుక ఆలోచించకుండా తనపై అసత్య ఆరోపణలకు సిద్ధపడినప్పుడు…పరువు నష్ట దావాకు సిద్ధమయ్యానని ఆమె తెలిపారు. మొత్తంగా  నిజానిజాలు తెలియకుండా తప్పుడు  వార్తలు ప్రచారం చేసేవారికి శ్యామల సరైన గుణపాఠం చెప్పారని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి