iDreamPost

బెంగళూరు రేవ్‌ పార్టీ.. ఎంట్రీ ఫీజు ఎంతో తెలిస్తే కళ్లు తిరిగి పడిపోతారు!

  • Published May 21, 2024 | 5:18 PMUpdated May 21, 2024 | 5:18 PM

Bangalore, Rave Party: గత రెండు రోజులుగా సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏంటో తెలిస్తే.. పేద, మధ్య తరగతి వారు షాక్‌ అవ్వడం ఖాయం. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

Bangalore, Rave Party: గత రెండు రోజులుగా సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏంటో తెలిస్తే.. పేద, మధ్య తరగతి వారు షాక్‌ అవ్వడం ఖాయం. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 21, 2024 | 5:18 PMUpdated May 21, 2024 | 5:18 PM
బెంగళూరు రేవ్‌ పార్టీ.. ఎంట్రీ ఫీజు ఎంతో తెలిస్తే కళ్లు తిరిగి పడిపోతారు!

‘రేవ్‌ పార్టీ’.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్‌ టాపిక్‌. బెంగళూరు రేవ్‌ పార్టీలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు పట్టుబడటం సంచలనంగా మారింది. బర్త్‌డే పార్టీ సందర్భంగా రేవ్‌ పార్టీ నిర్వహించారనే సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసి.. వంద మందికి పైగా సినీ, రాజకీయ ప్రముఖలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ నటి హేమా రేవ్‌ పార్టీలో పట్టుబడినట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అంతకంటే ముందు.. ఆమె పేరు కన్నడ మీడియాలో మారుమోగిపోయింది. కానీ, అదంతా ఫేక్‌ అని హేమా ఒక వీడియో చేసింది. కానీ, పోలీసులు అధికారికంగా ఆమె పేరు వెల్లడించడంతో.. ఆమె అబద్ధాలు చెబుతున్నట్లు తేలిపోయింది.

అయితే.. ఈ రేవ్‌ పార్టీ చాలా పెద్ద ఎత్తులో జరిగినట్లు తెలుస్తోంది. భారీగా డ్రగ్స్‌ ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు పోలీసులు కూడా వెల్లడించాడు. వాసు అనే బిజినెస్‌ మెన్‌ బర్త్‌ డే సందర్భంగా బెంగళూరులో ఈ రేవ్‌ పార్టీని నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించాడు. అయితే.. పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌ అందుబాటులో ఉంచడంతో.. ఈ రేవ్‌ పార్టీకి ఎంట్రీ ఫీజు కూడా పెట్టినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.50 లక్షలు ఫీజు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చి మీర.. చాలా మంది సెలబ్రెటీలు ఈ రేవ్‌ పార్టీలో పాల్గొన్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమం కావడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. డబ్బుతో పాటు పరువు పోయిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఈ రేవ్‌ పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ రేవ్‌ పార్టీకి ఎంట్రీ ఫీజు కింద రూ.50 లక్షలు పెట్టారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అలాగే పరువురు మోడల్స్‌, బుల్లితెర నటులు, బడా బాబుల కుమారులు, బిజినెస్‌మెన్లు, రాజకీయ నేతల కుమారులు పాల్గొన్నారు. మరి రేవ్‌ పార్టీకి ఎంట్రీ ఫీజే రూ.50 లక్షలు ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి