SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సత్తా చాటాడు. టెస్ట్ క్రికెట్లో ఓపిక, అనుభవం ఎంత ముఖ్యమో మరోసారి నిరూపిస్తూ.. యువకులతో నిండిన జట్టును సెంచరీతో ముందుండి నడిపిస్తున్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సత్తా చాటాడు. టెస్ట్ క్రికెట్లో ఓపిక, అనుభవం ఎంత ముఖ్యమో మరోసారి నిరూపిస్తూ.. యువకులతో నిండిన జట్టును సెంచరీతో ముందుండి నడిపిస్తున్నాడు.
SNP
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. కేవలం 33 పరుగులకే టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రజత్ పాటిదార్ అవుట్ కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జడేజాతో కలిసి రోహిత్ శర్మ.. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
33 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి.. కుప్పకూలీ స్థితిలో ఉన్న ఇన్నింగ్స్‌ను తన ఎక్స్‌పీరియన్స్‌తో పరువు నిలబెట్టాడు. మరోవైపు జడేజా సైతం హాఫ్ సెంచరీతో రోహిత్‌కు మంచి సపోర్ట్ అందించాడు. జట్టు మొత్తం యువ క్రికెటర్లతో నిండిపోయిన సమయంలో రోహిత్ శర్మ-జడేజా అనుభవం ఎంత ముఖ్యమో మరోసారి చాటి చెప్పారు. ఈ సెంచరీతో రోహిత్ శర్మ.. అత్యధిక పరుగులు చేసిన భారత నాలుగో ఆటగాడిగా నిలిచాడు. మాజీ దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీని దాటేసి.. సచిన్, కోహ్లీ, ద్రవిడ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మొత్తంగా.. 157 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సులతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. రోహిత్, జడేజా క్రీజ్‌లో ఉన్నారు.