iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్! తొలి ఇండియన్ ప్లేయర్ గా..

  • Published Apr 07, 2024 | 5:45 PM Updated Updated Apr 07, 2024 | 5:45 PM

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు హిట్ మ్యాన్. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు హిట్ మ్యాన్. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

Rohit Sharma: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్! తొలి ఇండియన్ ప్లేయర్ గా..

ఐపీఎల్ 2024 సీజన్ లో హ్యాట్రిక్ ఓటములతో తీవ్ర విమర్శల పాలవుతున్న ముంబై ఇండియన్స్ తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెలరేగిపోయింది. బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో.. భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా బ్యాటింగ్ లో టచ్ లోకి వచ్చాడు రోహిత్ శర్మ. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి అవుటైయ్యాడు. అయితే ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు హిట్ మ్యాన్. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయాడు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు రోహిత్. మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ సైతం అతడికి అండగా నిలబడుతూ.. స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించారు. వీరిద్దరు కేవలం 7 ఓవర్లకే 80 పరుగుల మెరుపు ఆరంభాన్ని అందించారు. ఈ స్టార్ట్ ను సద్వినియోగం చేసుకున్న ముంబై భారీ స్కోర్ సాధించింది. పాండ్యా(39), టిమ్ డేవిడ్(45*), రొమారియో షెఫర్డ్(39*) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా షెఫర్డ్ చివరి ఓవర్లో పెను విధ్వంసాన్నే సృష్టించాడు. నోర్ట్జే వేసిన ఈ ఓవర్లో ఏకంగా 4 సిక్సులు, 2 ఫోర్లతో 32 రన్స్ పిండుకున్నాడు.

Rohith record

దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో రోహిత్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే ధోని రికార్డును బ్రేక్ చేశాడు హిట్ మ్యాన్. ఈ మ్యాచ్ లో 3 సిక్సులు కొట్టడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో ఒక టీమ్ పై అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. అతడు ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ పై 49 సిక్సులు బాదాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. మహీ భాయ్ ఆర్సీబీపై 46 సిక్సులు బాది ప్రస్తుతం రెండో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మరి రోహిత్ సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.