iDreamPost

వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్న రోహిత్ శర్మ.. దెబ్బకు రికార్డులు షేక్!

  • Author Soma Sekhar Published - 11:23 AM, Mon - 30 October 23

రోహిత్ శర్మ దాటికి వరల్డ్ రికార్డులు షేక్ అవుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా పలు రికార్డులు సాధించాడు హిట్ మ్యాన్. మరి ఆ ఘనతలేంటో ఇప్పుడు చూద్దాం.

రోహిత్ శర్మ దాటికి వరల్డ్ రికార్డులు షేక్ అవుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా పలు రికార్డులు సాధించాడు హిట్ మ్యాన్. మరి ఆ ఘనతలేంటో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 11:23 AM, Mon - 30 October 23
వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్న రోహిత్ శర్మ.. దెబ్బకు రికార్డులు షేక్!

ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్నారు టీమిండియా క్రికెటర్లు. మరీ ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ నిర్దాక్షిణ్యంగా రికార్డులను బద్దలు కొడుతూ.. ముందుకు సాగుతున్నారు. వీరిద్దరి దాటికి రికార్డులన్నీ షేక్ అవుతున్నాయి. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు రోహిత్ శర్మ. కఠిన పరిస్థితుల్లో 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ ద్వారా హిట్ మ్యాన్ దెబ్బకు పలు రికార్డులు షేక్ అయ్యాయి. అందులో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డు కూడా ఉంది. మరి రికార్డుల్లో తగ్గేదేలే అంటున్న రోహిత్ ఖాతాలో చేరిన ఆ ఘనతలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ.. అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. అందుకు తగ్గట్లుగానే అతడు దుమ్మురేపుతున్నాడు. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లో తన బ్యాట్ కు పనిచెబుతూ.. జట్టు విజయాలతో పాటుగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ ద్వారా ఎవరీకి సాధ్యం కాని పలు రికార్డులు బద్దలు కొట్టాడు. మరి ఆ రికార్డులకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్ తో 3 ఫార్మాట్లలో కలిపి 100 మ్యాచ్ లకు కెప్టెన్సీ చేశాడు రోహిత్. అందులో 74 విజయాలు అందించాడు. అతడి విన్నింగ్ పర్సంటేజ్ 74 శాతంగా ఉంది. మరే ఇతర సారథులు కూడా ఈ ఘనతను సాధించలేకపోయారు. 100కు పైగా కెప్టెన్సీ చేసిన సారథుల్లో రోహిత్ దే బెస్ట్ రికార్డు.

కాగా.. ఈ రికార్డు ఇంతకు ముందు రికీ పాంటింగ్ పేరుపై ఉండేది. అతడు 70 శాతం విన్నింగ్ పర్సెంటేజ్ తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో ఆఫ్గాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్గాన్ మూడో ప్లేస్ లో ఉన్నాడు. అదీకాక ఈ మ్యాచ్ ద్వారా 18 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఐదో ఇండియన్ ప్లేయర్ గా ఘనతకెక్కాడు రోహిత్. అలాగే కెప్టెన్ గా 4వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో పాటుగా 2023లో వన్డేల్లో వేయి రన్స్ చేసిన తొలి కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ఇక సింగిల్ వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. వరల్డ్ కప్ ల్లో సచిన్(9) తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లు(7) అందుకున్న ఆటగాడిగా రోహిత్ ఘనతకెక్కాడు. దీంతో రోహిత్ దెబ్బకు రికార్డులన్నీ షేక్ అవుతున్నాయి అంటున్నారు క్రికెట్ అభిమానులు. మరి రోహిత్ సాధిస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి