iDreamPost
android-app
ios-app

VIDEO: చాహల్‌ను పిచ్చికొట్టడు కొట్టిన రోహిత్‌! చూసికూడా ఆపని కోహ్లీ

  • Published Jul 31, 2023 | 12:17 PM Updated Updated Jul 31, 2023 | 12:17 PM
  • Published Jul 31, 2023 | 12:17 PMUpdated Jul 31, 2023 | 12:17 PM
VIDEO: చాహల్‌ను పిచ్చికొట్టడు కొట్టిన రోహిత్‌! చూసికూడా ఆపని కోహ్లీ

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సార్లు కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేక టీమిండియా ఆటగాళ్లను బూతులు కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే అందంతా ఆటలో ఉండే భావోద్వేగం కారణంగానే జరుగుతుందని, మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ శర్మ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని భారత ఆటగాళ్లు చెబుతుంటారు. అయితే ఆటగాళ్లపై క్లోజ్‌గానే ఉండే రోహిత్‌.. అప్పుడప్పుడు వారిపై చేయి చేసుకుంటూ ఉంటాడు. గతంలో మొహమ్మద్‌ సిరాజ్‌ను తలపై కొట్టాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది.

తాజాగా టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌పై రోహిత్‌ శర్మ చేయిచేసుకున్నాడు. ముందు తలపై ఒక్కటిచ్చిన రోహిత్‌.. తర్వాత ఏకధాటిగా వీపు విమానం మోత మోగించాడు. అయితే ఇదంతా సరదాగా జరిగిందేలేండీ. రెండో వన్డే జరుగుతున్న సమయంలో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ సమయంలో కోహ్లీ, ఉనద్కట్‌, చాహల్‌, రోహిత్‌ డకౌట్‌లో కూర్చున్న సమయంలో ఈ ఫన్నీ మూమెంట్స్‌ చోటు చేసుకున్నాయి. చాహల్‌ ఏందో కామెంట్‌ చేసి ఉంటాడు. దానికి రోహిత్‌ అలా చావకొట్టి ఉంటాడని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే రోహిత్‌.. చాహల్‌ వీపు వాయిస్తున్నా.. పక్కన ఉన్న కోహ్లీ వారిని ఆపకుండా మూసిమూసి నవ్వులు నవ్వడం కూడా హైలెట్‌గా మారింది.

ఇలాంటి ఫన్నీ మూమెంట్లు బాగానే ఉన్నా.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మాత్రం టీమిండియా ఆట తీరు అంతబాగా లేదు. తొలి వన్డేలో 115 పరుగుల టార్గెట్‌ చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఆ టార్గెట్‌ను ఛేదించింది. యువ క్రికెటర్లకు గేమ్‌ టైమ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో రోహిత్‌ చివర్లో బ్యాటింగ్‌ వచ్చాడు. కోహ్లీ అసలు బ్యాటింగ్‌కే దిగలేదు. ఇక రెండో వన్డేలో వీరిద్దరూ అసలు బరిలోకే దిగలేదు. పూర్తి యువ క్రికెటర్లతో టీమిండియా విండీస్‌తో వన్డే ఆడి ఘోర పరాజయం పొందింది. దీంతో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లేకుంటే టీమిండియా ఓ పసికూన టీమ్‌ అని భారత క్రికెట్‌ అభిమానులే విమర్శలు గుప్పిస్తున్నారు. మరి మూడో వన్టేలో ఎలాంటి టీమ్‌తో ఇండియా ఆడుతుందో చూడాలి. టీమ్‌ ప్రదర్శన గురించి పక్కన పెడితే.. చాహల్‌-రోహిత్‌ ఫన్నీ ఇన్సిడెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 40 బంతుల్లోనే సెంచరీ..! ఆ తర్వాత కూడా ఆగని పూరన్‌ విధ్వంసం