SNP
SNP
కరేబియన్ గడ్డపై భారత బ్యాటర్లు కదం తొక్కుతున్నారు. బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి.. భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో దుమ్ములేపారు. కరేబియన్ బౌలర్లను చాలా సులువుగా ఎదుర్కొంటూ.. తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. ఏకంగా 229 పరుగులు జోడించారు. వెస్టిండీస్ గడ్డపై ఇదే టీమిండియాకు రెండో అత్యధిక పార్ట్నర్‌షిప్.
221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 103 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ యువ బౌలర్ అలిక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ 6 పరుగులు చేసి త్వరగానే అవుటైనా.. విరాట్ కోహ్లీ అండతో యువ ఓపెనర్, అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే 350 బంతుల్లో 14 ఫోర్లతో 143 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మూడో రోజు కూడా తన దండయాత్రను కొనసాగించి డబుల్ సెంచరీ సాధించేలా ఉన్నాడు. ఇక మరో ఎండ్‌లో సీనియర్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ 36 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మొత్తానికి టీమిండియా రెండో రోజు కూడా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కేవలం రెండే వికెట్లను కోల్పోయి.. 232 పరుగులు చేసింది. మొత్తంగా 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది. క్రీజ్‌లో జైస్వాల్(143), విరాట్ కోహ్లీ(36) ఉన్నారు.
రికార్డు మోత..
ఈ మ్యాచ్‌లో డెబ్యూ ప్లేయర్ యశస్వి జైస్వాల్ రికార్డుల మోత మోగించాడు. అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేసిన 17వ భారత ఆటగాడిగా నిలిచాడు. అలాగే ధావన్, పృథ్వీషా తర్వాత తొలి టెస్ట్‌లో సెంచరీ చేసిన మూడో ఓపెనర్‌గా నిలిచాడు. విదేశాల్లో తొలి టెస్ట్ ఆడి సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ మాత్రం జైస్వాలే. ఓవరాల్‌గా విదేశాల్లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి సెంచరీ చేసిన ఐదో భారత్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే విండీస్ గడ్డపై అరంగేట్రం టెస్ట్‌లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా జైస్వాల్ కొత్త చరిత్ర లిఖించాడు. మరి జైస్వాల్ తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేయడం, ఇన్ని రికార్డులు నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The moment to save for rest of the life.
Take a bow, Jaiswal 🔥pic.twitter.com/SSxIbgHoGh
— Johns. (@CricCrazyJohns) July 13, 2023
Captain, Leader, Legend, Rohit Sharma.
A great in world cricket. pic.twitter.com/rqFTYNXzTT
— Johns. (@CricCrazyJohns) July 13, 2023
ఇదీ చదవండి: కొడుకు క్రీజ్ లో ఉన్నా.. సచిన్ అవుటవ్వగానే ఛానల్ మార్చేసిన స్టార్ క్రికెటర్ పేరెంట్స్!