Nidhan
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 కెరీర్‌పై ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ ఫార్మాట్లో వీళ్లు కంటిన్యూ అవుతారా? లేదా తప్పుకుంటారా? అనేది క్లారిటీ లేకుండా పోయింది. అయితే దీనిపై తాజాగా అప్డేట్ వచ్చింది. వాళ్లిద్దరూ తమ మనసులో ఉన్న విషయాన్ని బీసీసీఐకి చెప్పేశారు.
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 కెరీర్‌పై ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ ఫార్మాట్లో వీళ్లు కంటిన్యూ అవుతారా? లేదా తప్పుకుంటారా? అనేది క్లారిటీ లేకుండా పోయింది. అయితే దీనిపై తాజాగా అప్డేట్ వచ్చింది. వాళ్లిద్దరూ తమ మనసులో ఉన్న విషయాన్ని బీసీసీఐకి చెప్పేశారు.
Nidhan
భారత క్రికెట్ జట్టు లెక్క సరిచేసింది. ఫస్ట్ టెస్ట్‌లో తమను చావుదెబ్బ తీసిన సౌతాఫ్రికాను రెండో టెస్ట్‌లో చిత్తు చేసింది. సఫారీ టీమ్‌ను వాళ్ల సొంతగడ్డపై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించి 98 రన్స్ లీడ్‌ను సాధించింది రోహిత్ సేన. రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రొటీస్‌ను బంతితో భయపెట్టిన టీమిండియా.. ఘనవిజయాన్ని అందుకొని టూర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలో బంతుల పరంగా ఇది అత్యంత త్వరగా ముగిసిన మ్యాచ్ కావడం విశేషం. 106.2 ఓవర్లలోనే ఈ మ్యాచ్‌లో రిజల్ట్ వచ్చేసింది. సౌతాఫ్రికా టూర్ ముగిసిపోవడంతో నెక్స్ట్ జరిగే టోర్నమెంట్స్‌పై భారత్ ఫోకస్ చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ మ్యాచులపై దృష్టి పెడుతోంది. ఈ తరుణంలో రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 కెరీర్ గురించి అప్డేట్ వచ్చేసింది.
టీ20ల్లో ఆడేందుకు తాము రెడీగా ఉన్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెప్పేశారని తెలుస్తోంది. టీ20 జట్టు సెలక్షన్‌కు తాము అందుబాటులో ఉంటామని.. పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని బోర్డుకు తెలిపారట. జనవరి 11వ తేదీ నుంచి ఆఫ్ఘానిస్థాన్‌తో స్వదేశంలో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది భారత్. దీంతో ఈ సిరీస్‌కు స్క్వాడ్‌ను సెలక్ట్ చేసేందుకు ఎస్ఎస్ దాస్, సలీల్ అంకోలాతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాము టీమ్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటామని హిట్‌మ్యాన్, కింగ్ కోహ్లీ చెప్పారని తెలిసింది. ఆఫ్ఘాన్‌తో పాటు ఇంగ్లండ్‌తో 5 టెస్టులకు కూడా టీమ్‌ను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ తమ నిర్ణయాన్ని చెప్పడంతో ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో వీళ్లు బరిలోకి దిగడం ఖాయం.
టీ20 వరల్డ్ కప్-2022 తర్వాత నుంచి కోహ్లీ, రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నారు. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో టెస్టులతో పాటు 50 ఓవర్ల ఫార్మాట్ మీదే ఫోకస్ చేస్తూ వచ్చారు. అయితే టీ20 ప్రపంచ కప్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో వీళ్లు పొట్టి ఫార్మాట్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్‌గా, ఓపెనర్‌గా టీమ్‌ను ముందుండి నడిపించే రోహిత్‌తో పాటు ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేస్తూ, మ్యాచుల్ని ఫినిష్ చేస్తే కోహ్లీ అవసరం టీమిండియాకు ఉంది. అందుకే వీళ్లిద్దర్నీ ఎలాగైనా టీ20 వరల్డ్ కప్‌లో ఆడించాలని సీనియర్ క్రికెటర్లు, అభిమానుల నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. అయితే ఎట్టకేలకు టీ20ల్లో ఆడేందుకు వాళ్లు ఒప్పుకోవడంతో వచ్చే ప్రపంచ కప్‌లో భారత్ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగనుంది. మరి.. కోహ్లీ, రోహిత్ టీ20ల్లో కమ్‌బ్యాక్ ఇవ్వనుండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Ravi Shastri: ఇలాంటి సిరీస్ దండగ.. IND vs SA టెస్ట్ సిరీస్ పై రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు!
Rohit Sharma & Virat Kohli have informed the BCCI that they are available for selection in the T20I format. [Express Sports] pic.twitter.com/BPXaNovBuL
— Johns. (@CricCrazyJohns) January 5, 2024