iDreamPost

వీడియో: అందరూ చూస్తుండగానే గాల్లోకి ఎగిరిపోయాడు!

వీడియో: అందరూ చూస్తుండగానే గాల్లోకి ఎగిరిపోయాడు!

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాహనాల్లో లోపాల కారణంగా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమాయకులు బలి అవుతున్నారు. ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారి జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా, చెన్నైలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది.

ఆ కారు ఢీకొన్న వేగానికి అతడు గాల్లో ఎగిరి దూరంగా పోయి పడ్డాడు. అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం చెన్నై, కీల్‌ పాలక్‌ రోడ్డులో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అటు, ఇటు చూసుకుంటూ రోడ్డుకు వైపున వెళుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతి వేగంతో వచ్చిన ఓ కారు అతడ్ని ఢీకొట్టింది. ఆ కారు ఢీకొట్టిన వేగానికి ఆయన గాల్లోకి ఎగిరి దూరంగా పడ్డాడు. కారు బలంగా ఢీకొన్న కారణంగా శరీరంలోని ముఖ్యమైన భాగాలకు గాయాలు అయ్యాయి.

దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. అతి వేగంగా కారు నడిపి ఓ ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని అంటున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి