iDreamPost
android-app
ios-app

అడగకుండానే ఆ క్రికెటర్‌ నాకెంతో సాయం చేశాడు: రింకూ సింగ్‌

  • Published Nov 25, 2023 | 4:14 PM Updated Updated Nov 27, 2023 | 3:22 PM

టీమిండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో దుమ్ములేపాడు. ప్రస్తుతం ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌ కోసం సిద్దం అవుతున్నాడు. అయితే.. తన స్టార్టింగ్‌ డేస్‌లో టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా తనకు ఎలా సాయపడ్డాడో వివరించాడు.

టీమిండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో దుమ్ములేపాడు. ప్రస్తుతం ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌ కోసం సిద్దం అవుతున్నాడు. అయితే.. తన స్టార్టింగ్‌ డేస్‌లో టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా తనకు ఎలా సాయపడ్డాడో వివరించాడు.

  • Published Nov 25, 2023 | 4:14 PMUpdated Nov 27, 2023 | 3:22 PM
అడగకుండానే ఆ క్రికెటర్‌ నాకెంతో సాయం చేశాడు: రింకూ సింగ్‌

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో భారత క్రికెట్‌ అభిమానులంతా తీవ్రంగా బాధపడ్డారు. ఆ బాధ నుంచి ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు రింకూ సింగ్‌ కాస్త ఊరటనిచ్చాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన తొలి టీ20ల్లో చివరి బాల్‌ కు సిక్స్‌ కొట్టి థ్రిలింగ్‌ విక్టరీ అందించాడు. ఈ విజయం వరల్డ్‌ కప్‌ బాధను తీర్చకపోయినా.. కాస్త స్వాంతనను అయితే ఇచ్చింది. ఐపీఎల్‌ లో ఫినిషర్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రింకూ సింగ్‌.. జాతీయ జట్టులోకి వచ్చి కూడా అదే ఫినిషింగ్‌ రోల్‌ లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఆసీస్‌ తో జరిగిన తొలి టీ20ల్లో 209 పరుగుల భారీ టార్గెట్‌ ఛేజ్‌ చేస్తున్న క్రమంలో మంచి ఇన్నింగ్స్‌ తో ఆకట్టుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌ తో మరోసారి రింకూపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే.. తాజాగా తన కెరీర్‌ ను ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి రింకూ మాట్లాడుతూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ అంటే తనకు చాలా ఇష్టమని గతంలోనే రింకూ వెల్లడించిన విషయం తెలిసిందే. రైనా భాయ్‌ కి తాను చాలా పెద్ద ఫ్యాన్‌ అని కూడా తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సురేష్‌ రైనా భాయ్‌ అంటే తనకు చాలా ఇష్టమని, అతని తాను పెద్ద ఫ్యాన్‌ అని, నిజానికి నేను సురేష్ రైనాకా ఆడాలని ప్రయత్నిస్తూ.. అతన్ని కాపీ కొడతానంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఇక తాను ఐపీఎల్‌ లోకి రాకముందు కూడా సురేష్‌ రైనా తనకు ఎంతో సాయం చేశాడని, నాకు ఎంతో అవసరం ఉన్న సమయంలో నేను అడగకముందే.. క్రికెట్‌ ఎక్విప్‌మెంట్‌ ను తనకు ఇచ్చేవాడని రింకూ గతాన్ని గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. సురేష్‌ రైనా, రింకూ సింగ్‌ ఇద్దరూ యూపీకి చెందిన ఆటగాళ్లు అనే విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్‌ లో సురేష్‌ రైనా చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ లయన్స్‌ జట్లుకు ఆడగా.. రింకూ సింగ్‌ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ టీమ్‌ తరఫున ఆడుతూ.. ఫినిషర్‌ గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పుడు టీమిండియా తరఫున కూడా అలాంటి ప్రదర్శనే కనబరుస్తూ.. భారత జట్టుకు భవిష్యత్తు స్టార్‌ గా ఎదుగుతున్నాడు. మరి రింకూ సింగ్‌ బ్యాటింగ్‌ తో పాటు రైనాతో ఉన్న అనుబంధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.