iDreamPost

జగన్ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం.. అసైన్డ్ భూములపై హక్కులు పేదలకు వరం

జగన్ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం.. అసైన్డ్ భూములపై హక్కులు పేదలకు వరం

ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అద్భుతమైన పాలనను అందిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ జనరంజకమైన పాలనను అందిస్తున్నారు సీఎం జగన్. వృత్తిపనివారికి, కార్మికులకు, విద్యార్థులకు, అర్హులైన అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న అసైన్డ్ భూములపై పేద రైతులకు హక్కులు కల్పిస్తూ ఏపీ శాసన సభలో బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పేద రైతులకు భారీ ప్రయోజనం చేకూరనున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న పేద రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. అమ్ముకుందామంటే తక్కువ ధర, బ్యాంకులో లోన్ తీసుకుందామంటే రిజిస్టేషన్ లేదు కాబట్టి బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఇదే మాదిరిగా ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కలిగిన వారి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండేది. రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి 10 లక్షలు విలువ చేసే భూమిని సగం ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీనిపై ఆలోచించి పేదలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములపై పేద రైతులకు హక్కులు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల చట్టం 1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.

అసైన్డ్ భూములతో పాటు గవర్నమెంట్ పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలకు పది సంవత్సరాల తరువాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కాగా ఈ రెండు అంశాలకు సంబంధించిన బిల్లు శాసన మండళిలో కూడా ఆమెదం పొంది, ఆ తర్వాత గవర్నర్ ఆమోదం పొంది చట్ట రూపం దాల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు విసృతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ బిల్లును పేదల పాలిట వరంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి