iDreamPost

టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం BCCI నన్ను సంప్రదించింది.. కానీ ఒప్పుకోలేదు: దిగ్గజ క్రికెటర్

టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ నన్ను సంప్రదించిందని, కానీ ఓ కారణం చేత నేను వారి అభ్యర్థనను తిరస్కరించానని షాకింగ్ వివరాలు వెల్లడించాడు ఓ దిగ్గజ క్రికెటర్. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ నన్ను సంప్రదించిందని, కానీ ఓ కారణం చేత నేను వారి అభ్యర్థనను తిరస్కరించానని షాకింగ్ వివరాలు వెల్లడించాడు ఓ దిగ్గజ క్రికెటర్. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం BCCI నన్ను సంప్రదించింది.. కానీ ఒప్పుకోలేదు: దిగ్గజ క్రికెటర్

టీమిండియా హెడ్ కోచ్ పదవి ఎవరిని వరిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచ క్రికెట్ మెుత్తం ఎదురుచూస్తోంది. భారత జట్టుకు సరైన హెడ్ కోచ్ ను నియమించేందుకు బీసీసీఐ వేట మెుదలుపెట్టింది. ఇందుకోసం హేమాహేమీలైన దిగ్గజ క్రికెటర్లను సంప్రదిస్తోంది బీసీసీఐ. ఇక హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మే 27 వరకు చివరి తేదిగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ నన్ను సంప్రదించిందని, కానీ ఓ కారణం చేత నేను వారి అభ్యర్థనను తిరస్కరించానని షాకింగ్ వివరాలు వెల్లడించాడు ఓ దిగ్గజ క్రికెటర్.

టీమిండియా హెడ్ కోచ్ పదవిని భర్తీ చేసేందుకు బీసీసీఐ ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం దిగ్గజ క్రికెటర్లను వరుసగా సంప్రదిస్తూ వస్తోంది. హెడ్ కోచ్ పదవి రేసులో న్యూజిలాండ్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మహేళ జయవర్థనే, గౌతమ్ గంభీర్, రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ లతో పాటుగా మరికొంత మంది దిగ్గజాలు ఉన్నారు. అయితే వీరిలో స్టీఫెన్ ఫ్లెమింగ్ ను హెడ్ కోచ్ గా తీసుకోవాలని బీసీసీఐ మెుగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు ఆసీస్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.

తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం.. ‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ నన్ను సంప్రదించింది. కానీ వారి అభ్యర్థనను నేను సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే? హెడ్ కోచ్ పదవిలో ఉంటే.. దాదాపు 10 నెలలు టీమిండియాతోనే ఉండాలి. దాంతో నా ఫ్యామిలీకి నేను దూరం అవుతాను. ఈ కారణంగానే నేను హెడ్ కోచ్ పదవిని తిరస్కరించాను” అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్ ఇంత మంచి ఆఫర్ పాంటింగ్ వద్దు అనుకోవడం ఏంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి