iDreamPost

CM రేవంత్ గుడ్ న్యూస్.. గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు- ఒక్కొక్కరికి 5 లక్షలు..!

గల్ఫ్ దేశాలకు వలసపోయే కార్మికులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. సీఎం ప్రకటనతో వారి సమస్యలు తీరనున్నాయి. సీఎం రేవంత్ ప్రకటనతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గల్ఫ్ దేశాలకు వలసపోయే కార్మికులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. సీఎం ప్రకటనతో వారి సమస్యలు తీరనున్నాయి. సీఎం రేవంత్ ప్రకటనతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

CM రేవంత్ గుడ్ న్యూస్.. గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు- ఒక్కొక్కరికి 5 లక్షలు..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత రెండో సీఎంగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి.. మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తనదైన మార్క్ పాలనతో ముందుకెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇక తాజాగా మరో సంచనల నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం, గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. సీఎం ప్రకటనతో గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌ హోటల్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

గల్ఫ్ కార్మికుల సమస్యలను కార్మిక సంఘాల నుంచి స్వయంగా స్వయంగా తెలుసుకున్నారు సీఎం రేవంత్. ఈ సమావేశంలో గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నేతలు సీఎం రేవంత్ ను కోరారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. గల్ఫ్ కార్మికులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.

తెలంగాణ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు చాలామంది వెళ్తుంటారు. అయితే అక్కడికి వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోయి నానా తిప్పలు పడుతుంటారు. చేతిలో చిల్లిగవ్వ లేక తినడానికి తిండి లేక ఆదరించే వారు లేక నరకయాతన అనుభవిస్తుంటారు. ఇలాంటి కష్టాలకు సీఎం రేవంత్ చెక్ పెట్టనున్నారు. తెలంగాణలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉన్నాయని సీఎం రేవంత్ తెలిపారు. గల్ఫ్ వెళ్లేముందు కార్మికులకు ప్రభుత్వం తరపున శిక్షణ ఇస్తామని వెల్లడించారు.

ఏజెంట్లు మోసాలకు పాల్పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని.. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న వాళ్లే ఏజెంట్లుగా ఉంటారని తెలిపారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించి కార్మికుల సంక్షేమ బాధ్యతలు అప్పగిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ బాధితుల పిల్లలకు మంచి విద్యను అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలిపారు. సీఎం ప్రకటనతో గల్ఫ్ కార్మికులతో పాటు వారి కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి