iDreamPost

హైటెక్ సిటీకి పునాదిరాయి వేసింది చంద్రబాబు కాదు : రేవంత్‌ రెడ్డి

  • Published Nov 05, 2023 | 5:58 PMUpdated Nov 05, 2023 | 5:58 PM

నోరు తెరిస్తే చాలు హైటెక్‌ సిటీని కట్టింది నేను.. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే అని ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడికి.. రేవంత్‌ రెడ్డి షాక్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

చంద్రబాబు నోరు తెలిస్తే చాలు.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానే అంటాడు. తన వల్లనే నగరంలో ఐటీ డెవలప్‌మెంట్‌ జరిగిందని.. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపింది తానేనని డబ్బు కొట్టుకుంటాడు. ఇక ఈ మధ్యకాలంలో అయితే కొన్ని చోట్ల ప్రసంగిస్తూ.. సెల్‌ఫోన్‌లో ఉండే టార్చ్‌లైట్‌ని కనిపెట్టింది కూడా తానేనని ప్రచారం చేసుకున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా చంద్రబాబు మైండ్‌లోంచి హైదరాబాద్‌ మాత్రం పోలేదు. ఇక్కడ హైటెక్‌ సిటీని కట్టిందే తానని ప్రచారం చేసుకునేవాడు.

ఇక చంద్రబాబుకి భజన చేసే కొందరు నేతలు కూడా.. హైదరాబాద్‌లోనే కాక దేశంలోనే ఐటీ అభివృద్ధి జరిగింది అంటే అందుకు కారణం తమ నాయకుడు, ఆయన చేసిన కృషి అనేవారు. మొన్నటి వరకు ఇదే పాట పాడిన రేవంత్‌ రెడ్డి సడెన్‌గా మాట మార్చారు. హైటెక్‌ సిటీకి పునాది రాయి వేసింది బాబు కాదంటూ వ్యాఖ్యానించాడు. ఆ వివరాలు..

ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైటెక్‌ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి. అది కూడా రాజీవ్‌ గాంధీ హయాంలో. అలానే కంప్యూటర్‌ని ఈ దేశంలో ప్రవేశపెట్టింది రాజీవ్‌ గాంధీ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అంతేకాక రేవంత్‌ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు కొందరు. టీడీపీలో ఉన్నప్పుడేమో కంప్యూటర్‌ని కనిపెట్టిందే బాబు అన్న రేంజ్‌లో బిల్డప్‌ ఇచ్చి.. ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నావ్‌. సర్లే ఇప్పటికైనా వాస్తవం అంగీకరించావు అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి