iDreamPost

విషాదం.. ఆర్బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎస్ వెంకట్రమణన్ శనివారం ఉదయం కన్నుమూశారు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎస్ వెంకట్రమణన్ శనివారం ఉదయం కన్నుమూశారు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

విషాదం.. ఆర్బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్ యొక్క కేంద్ర బ్యాంకు. దేశంలోని అన్ని బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల మేరకు పనిచేస్తాయి. ఆర్బీఐ అధిపతి గవర్నర్. ఆర్థిక శాస్త్రంలో నిపుణులైన వారిని కేంద్రం గవర్నర్ గా నియమిస్తుంది. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ కన్నుమూశారు. 1990 నుంచి 92 వరకు ఆర్బీఐ గవర్నర్ గా విధులు నిర్వహించిన ఎస్ వెంక‌ట‌ర‌మ‌ణ‌న్ అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అత్యుత్తమ గవర్నర్ లలో ఎస్ వెంకటరమణన్ ఒకరు. ఆయన హయాంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఎస్ వెంకట్రమణన్ శనివారం ఉదయం కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న ఆయన ఆనారోగ్యం కార‌ణంగా ప్రాణాలు విడిచిన‌ట్లు కుటుంబీకులు వెల్ల‌డించారు. ఆర్బీఐ 18వ గ‌వ‌ర్న‌ర్‌గా వెంక‌ట‌ర‌మ‌ణ‌న్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 1990 నుంచి 92 వ‌ర‌కు ఆయ‌న ఆ పోస్టులో ఉన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ‌లో ఆయ‌న 1985 నుంచి 1989 వ‌ర‌కు ఆర్ధిక కార్య‌ద‌ర్శిగా కూడా చేశారు. ఆయ‌న‌కు గిరిజా, సుధా అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. కాగా ఆయన మృతి పట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.