iDreamPost

క్రెడిట్ కార్డ్ యూజర్లకు RBI గుడ్ న్యూస్.. ఆ రూల్స్ లో మార్పు.. ప్రయోజనాలివే!

క్రెడిట్ కార్డు వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలను మార్చింది. దీంతో కస్టమర్లకు ప్రయోజనం కలుగనున్నది.

క్రెడిట్ కార్డు వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలను మార్చింది. దీంతో కస్టమర్లకు ప్రయోజనం కలుగనున్నది.

క్రెడిట్ కార్డ్ యూజర్లకు RBI గుడ్ న్యూస్.. ఆ రూల్స్ లో మార్పు.. ప్రయోజనాలివే!

క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరుగుతోంది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. బ్యాంకులు సైతం రకరకాల ఆఫర్లతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుండడంతో కస్టమర్లు తీసుకోవడానికి ఇంట్రస్టు చూపిస్తున్నారు. ఒకరి దగ్గర ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అయితే క్రెడిట్ కార్డు నియమాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టింది. కొత్త రూల్స్ తో క్రెడిట్ కార్డు యూజర్లకు ప్రయోజనం కలుగనున్నది.

ఆర్బీఐ కొత్త నిబంధనలు కస్టమర్లకు మరింత లాభం చూకూర్చనున్నాయి. ఇటీవల ఆర్భీఐ రూల్స్ లో పలు మార్పులు చేసింది. క్రెడిట్ కార్డు యూజర్లు తమ క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చుకోవడానికి వీలు కల్పించింది. ఇది వరకు క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ ను ఒకసారి మార్చుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఉండేది. బిల్లింగ్ సైకిల్ వ్యవధి 28 నుండి 32 రోజుల వరకు ఉంటుంది. క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ అయిన రోజు నుండి బిల్లింగ్ సైకిల్ ప్రారంభమవుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ నే స్టేట్ మెంట్ సైకిల్ అంటారు. ఈ స్టేట్ మెంట్ సైకిల్ ద్వారా క్రెడిట్ కార్డు లావాదేవీలను తెలుసుకోవచ్చు.

rbi new rules

క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ అయ్యే తేదీనే స్టేట్ మెంట్ తేదీ అంటారు. స్టేట్‌మెంట్ జనరేట్ అయిన తర్వాత బిల్లు చెల్లించడానికి దాదాపు 10-15 రోజుల సమయం ఉంటుంది. 30-రోజుల బిల్లింగ్ సైకిల్, గడువు తేదీ వరకున్న 10-15 రోజులు కలిపి 45 రోజులు ఇంట్రెస్ట్‌ ఫ్రీ పీరియడ్‌ పొందుతారు. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం బిల్లింగ్ సైకిల్ ను మార్చుకోవచ్చు. దీంతో మీకు ఇంట్రెస్ట్‌ ఫ్రీ పీరియడ్‌ పెరుగుతుంది. ప్రతి నెలా 1వ తేదీ, 10వ తేదీ మధ్య క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్లైతే, 25వ తేదీ తర్వాత స్టేట్‌మెంట్ తేదీని సెట్ చేయడం ద్వారా, గడువు తేదీ వచ్చే నెల 10 లేదా 15వ తేదీకి వస్తుంది. ఇది మీకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ ఫ్రీ పీరియడ్‌ అందిస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీలు చేయకపోయినప్పటికీ కార్డు వినియోగంలో ఉండే విధంగా మార్పులు చేసింది ఆర్బీఐ. అంటే స్టేట్‌మెంట్లు తీయడం, పిన్ మార్చడం, ట్రాన్సాక్షన్ పరిమితిని సవరించడం వంటివి చేస్తే కార్డు వినియోగంలో ఉన్నట్లే భావిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి