iDreamPost

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక జనరల్‌ టికెట్‌ కష్టాలు తీరినట్లే.. ఇంటి నుంచే

  • Published Apr 26, 2024 | 10:15 AMUpdated Apr 26, 2024 | 10:15 AM

UTS App: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. జనరల్‌ టికెట్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ.. ఇంటి నుంచే టికెట్‌ బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

UTS App: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. జనరల్‌ టికెట్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ.. ఇంటి నుంచే టికెట్‌ బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

  • Published Apr 26, 2024 | 10:15 AMUpdated Apr 26, 2024 | 10:15 AM
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక జనరల్‌ టికెట్‌ కష్టాలు తీరినట్లే.. ఇంటి నుంచే

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మన జీవితంలో అనేక మార్పులు, సౌకర్యాలు వస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంక్‌ సేవలు, షాపింగ్‌ వంటి వాటి కోసం బయటకు వెళ్లి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. మరి అదే ఇప్పుడో అన్ని ఆన్‌లైన్‌ మయం అయ్యాయి. ఇంట్లో కూర్చునే ఆ పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇక ప్రయాణాలు, సినిమాలు చూడాలన్న గంటల సమయం ముందుగానే వెళ్లి టికెట్లు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు కుదిరినప్పుడు టికెట్‌ బుక్‌ చేసుకుని.. ఆ సమయానికి వెళ్ల చక్కగా మన పనులు ముగించుకుని రాగలుగుతున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే శాఖ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇంటి నుంచే రైల్వే జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఆ వివరాలు..

సాధారణంగా రైల్వే ప్రయాణాలు చేసేవారు.. ఫస్ట్‌, ఏసీ, సెకండ్‌ క్లాస్‌ టికెట్లు ముందుగానే బుక్‌ చేసుకోవాలి. అప్పటికప్పుడు దొరకడం కష్టం. అదే జనరల్‌ టికెట్లు అయితే.. రైల్వే స్టేషన్‌కి వెళ్లి క్యూలో నిలబడి టికెట్‌ తీసుకోవాలి. అయితే ముందుగా వెళ్తే ఇబ్బంది లేదు. కానీ అనుకోని ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మనం వెళ్లి టికెట్‌ తీసుకునేలోపే ట్రైన్‌ కదులుతుంది. ఒక్కోసారి టికెట్‌ తీసుకునే సమయం కూడా ఉండదు.

Good news for railway passengers

అప్పుడు టికెట్‌ లేకుండా ట్రైన్‌ ఎక్కితే జరిమానా కట్టాల్సి వస్తుంది. అదృష్టం బాగుంటే తర్వాత స్టేషన్‌లో టికెట్‌ తీసుకోవచ్చు. అయితే ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవు అంటుంది రైల్వే శాఖ. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే రైల్వే శాఖ.. ఆ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యాప్‌లను కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేస్తోంది. ఈ క్రమంలనే రైల్వేశాఖ గతంలోనే తీసుకొచ్చిన యూటీఎస్‌ (అన్‌రిజర్వుడ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) యాప్‌లో తాజాగా మార్పులు చేసింది.

జనరల్‌ టికెట్‌ బుకింగ్‌ సమస్యల పరిష్కారం కోసం గతంలోనే రైల్వే శాఖ యూటీఎస్‌ (అన్‌రిజర్వుడ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు క్యూలో నిలుచోకుండా ఈ యాప్‌ ద్వారా జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అయితే ఇది రైల్వే స్టేషన్‌కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించేది. దాంతో సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆ శాఖ గుర్తించింది.

ఈ క్రమంలో తాజాగా ఈ యాప్‌ని అప్డేట్‌ చేసింది రైల్వే శాఖ. రైలు ప్లాట్‌ఫామ్‌కు ఎంత దూరంలో ఉన్నా టికెట్‌ పొందేలా యూటీఎస్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేశారు. దాంతో ఇంట్లో ఉండగానే కంగారుపడకుండా జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకుని రైలు వచ్చే సమయానికి స్టేషన్‌కు వస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా రైలు ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతుందనే సమయానికి అంటే.. ప్లాట్‌పామ్‌కు 50 మీటర్లు దూరంలో ఉన్నపుడు మాత్రం ఈ యాప్‌ పనిచేయదని గమనించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి