iDreamPost

Railway Reservation: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. రిజర్వేషన్‌ సేవలకు బ్రేక్!

భారత రైల్వే వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే సరకులను రవాణ చేయడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా రిజర్వేషన్ విషయంలో ఓ కీలక విషయాన్ని రైల్వే అధికారులు తెలిపారు.

భారత రైల్వే వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే సరకులను రవాణ చేయడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా రిజర్వేషన్ విషయంలో ఓ కీలక విషయాన్ని రైల్వే అధికారులు తెలిపారు.

Railway Reservation: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. రిజర్వేషన్‌ సేవలకు బ్రేక్!

మన దేశంలోనే రవాణ వ్యవస్థల్లో  ప్రధానమైనది రైల్వే. దీని ద్వారా  నిత్యం వేలాది మంది గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే ఛార్జీలు చౌకగా ఉండటంతో  రైలులు ప్రయాణించేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలానే రైల్వేకు సంబంధించిన సమాచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో రైల్వేశాఖ కూడా తరచూ ఏదో ఒక సమాచారం అందిస్తూనే ఉంటుంది. అలానే తాజాగా కూడా రైల్వే శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. రిజర్వేషన్ సేవలకు కాస్తా విరామం ప్రకటించింది. అయితే అది దేశం మొత్తంగా మాత్రం కాదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో నడిచే రైళ్లకు మాత్రమే. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీ  ప్రాంతంతో పాటు ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న వారుశుక్రవారం రాత్రిలోపే చేసేయండి. కారణం..  ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పని చేయవని అధికారులు చెబుతున్నారు. అయితే కేవలం కొన్ని గంటల సమయమే కాబట్టి రిజర్వేషన్ సర్వీసులు నిలిచిపోయిన సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే అసౌకర్యానికి గురవుతారని రైల్వే అధికారులు పేర్కొన్నారు. పీఆర్ఎస్ ని చాలా తక్కువ మంది మాత్రమే ఈ సేవలను ఉపయోగిస్తున్నారని రైల్వే చెబుతోంది. ఈ పీఆర్‌ఎస్‌ అనేది దేశవ్యాప్తంగా ఐదు నగరాల నుండి పనిచేస్తుంది. వీటిలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, గౌహతి ఉన్నాయి. ఈ  ప్రాంతాల్లో పీఆర్ఎస్ సేవలను చాలా మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు.

Alert for railway passengers

అలానే ఢిల్లీ పీఆర్‌ఎస్‌ వ్యవస్థను శుక్రవారం రాత్రి తాత్కాలికంగా మూసివేయనున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా నిర్వహించే అన్ని రైళ్లలో రిజర్వేషన్, రద్దు, ఎక్వైరీ (139, కౌంటర్ సర్వీస్), ఇంటర్నెట్ బుకింగ్‌తో సహా అన్ని రకాల సేవలకు బ్రేక్ పడనుంది. ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.45 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 04.15 గంటల వరకు దాదాపు 04.30 గంటల పాటు ఈ సేవలు నిల్చిపోనున్నాయి. ఈ విరామ సమయంలో ఢిల్లీ పీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఏ  సేవలను మరే ఇతర నగరంలోని పీఆర్‌ఎస్ నుంచి చేయడానికి వీలు పడదు. ఢిల్లీ పీఆర్ఎస్ పరిధిలో రిజర్వేషన్ లేదా మరేదైనా పనిని పూర్తి చేయాలనుకునే వారు శుక్రవారం రాత్రికి ముందే పూర్తి చేయండ మంచింది. లేకపోతే మీరు శనివారం ఉదయం వరకు ఆగాల్సి ఉంటుంది. ఆ తరువాత మాత్రమే రిజర్వేషన్ పనులు పూర్తి చేయగలుగుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి