iDreamPost

సామాన్యుడి బడ్జెట్‌లో యాక్టివా EV! దీని గురించి తెలిస్తే వేరే వాటిని చూడరు

హోండా యాక్టివా స్కూటీలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ స్కూటీని బెస్ట్ స్కూటీగా అభివర్ణిస్తారు యాక్టివా లవర్స్. అలాంటి యాక్టివా నుంచి బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందంటే మధ్యతరగతి మనుషుల ఆనందానికి అవధులు ఉండవు.

హోండా యాక్టివా స్కూటీలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ స్కూటీని బెస్ట్ స్కూటీగా అభివర్ణిస్తారు యాక్టివా లవర్స్. అలాంటి యాక్టివా నుంచి బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందంటే మధ్యతరగతి మనుషుల ఆనందానికి అవధులు ఉండవు.

సామాన్యుడి బడ్జెట్‌లో యాక్టివా EV! దీని గురించి తెలిస్తే వేరే వాటిని చూడరు

మార్కెట్లో చాలా కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో ఏది ఎక్కువ రేంజ్ ఇస్తుంది, ఏది టాప్ స్పీడ్ ని ఇస్తుంది అనేదే జనాలు చూస్తున్నారు. ఏథర్ రిజ్టా ఈవీ అయితే 160 కి.మీ. రేంజ్ తో గంటకు 80 కి.మీ. టాప్ స్పీడ్ తో వస్తుంది. దీన్ని కొనాలంటే లక్ష 45 వేలు అవుతుంది. ఓలా ఎస్ 1 ప్రో కూడా 195 కి.మీ. రేంజ్ తో గంటకు 120 కి.మీ స్పీడ్ తో వస్తుంది. దీన్ని కొనాలన్నా కూడా లక్ష 30 వేలు అవుతుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకుంటే.. దీని రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ 212 కి.మీ., టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 105 కిలోమీటర్లుగా ఉంది. దీనికి తగ్గట్టే ధర కూడా లక్ష 65 వేలు ఉంది. 200 కి.మీ. రేంజ్ ఇచ్చే ఏ టూవీలర్ ఈవీ అయినా సరే కనీసం లక్ష 50 వేలు పెట్టాలి. కానీ లక్ష రూపాయల బడ్జెట్ లో 200 కిలోమీటర్ల పైనే అంటే 240 కి.మీ. రేంజ్ ఇచ్చే ఈవీ వస్తే సంతోషమే కదా. అది కూడా అందరూ మెచ్చిన హోండా యాక్టివా నుంచి వస్తున్న ఈవీ అయితే ఆ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది కదా.

రేంజ్:

హోండా యాక్టివాకి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్కూటీ అంటే హోండా యాక్టివా అని అంటారు. అలాంటిది యాక్టివా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందంటే యాక్టివా లవర్స్ కి ఎవరైనా ఎగిరి గంతేస్తారు. చాలా కాలంగా హొండా ఎలక్ట్రిక్ స్కూటీ వస్తుందా? లేదా? అనే సందేహాలు ఉండేవి. అయితే ఫైనల్ గా హోండా కంపెనీ ఈ ఈవీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పలు ఆటోమొబైల్ వెబ్ సైట్లు ప్రచురించిన కథనాల ప్రకారం.. త్వరలోనే లాంఛ్ కాబోతున్నట్లు హోండా కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ మెంబర్ ఒక ట్వీట్ లో వెల్లడించారు. జూన్ నెలలోనే లాంఛ్ చేయబోతున్నారని పలు ఆటోమొబైల్ వెబ్ సైట్స్ వెల్లడించాయి. అయితే ఇది 240 కి.మీ. రేంజ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏ కంపెనీ కూడా ఈ రేంజ్ తో ఈవీ స్కూటర్ ని తీసుకురాలేదు. కానీ హోండా కంపెనీ వీటన్నిటినీ బీట్ చేస్తూ అత్యధిక రేంజ్ తో ఈవీని తీసుకురానున్నట్లు సమాచారం.

టాప్ స్పీడ్:

అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేసిన లిథియం అయాన్ బ్యాటరీతో ఈ యాక్టివా ఈవీ వస్తుందట. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. అంతేకాదు ఒక గంటలోనే ఫుల్ ఛార్జ్ అయ్యేలా హైపర్ ఛార్జింగ్ పోర్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది అచ్చం యాక్టివా పెట్రోల్ వేరియంట్ లానే ఉంటుందని అంటున్నారు. కొంతమంది మాత్రం స్టైలిష్ లుక్ తో రూపొందించినట్లు చెబుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ యాక్టివా ఈవీ ముందు తెలుపు రంగులో విడుదల చేయబోతున్నారట. బీఎల్డీసీ మోటార్ తో గంటకు 130 కి.మీ. టాప్ స్పీడ్ తో రానుందట.

ఫీచర్స్ మరియు ధర:

వీటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పార్క్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్, యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ అలార్మ్, బ్లూటూత్ కాలింగ్, మెసేజింగ్ వంటి ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని ధర కూడా లక్ష 10 వేలు ఉంటుందని టాక్. నిజంగా ఏ బడ్జెట్ లో కనుక ఈ రేంజ్ తో ఈ టాప్ స్పీడ్ తో కనుక హోండా యాక్టివా స్కూటీ వస్తే కనుక సామాన్యులకి పండగే. దీన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు. ఎందుకంటే 200 కి.మీ. రేంజ్ ఈవీ కావాలంటే లక్ష 50 వేల నుంచి 2 లక్షలు రేటు చెబుతున్నారు. అలాంటిది దగ్గర దగ్గర 250 కి.మీ. రేంజ్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా సామాన్యుల బడ్జెట్ లో. ఇందుకేనేమో యాక్టివాకి అంత ఫ్యాన్ బేస్ ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి