iDreamPost

Reliance: అంబానీ చేతికి డిస్నీ ప్లస్ హాట్​స్టార్! చేతులారా చేసుకున్న డిస్నీ!

  • Published Dec 12, 2023 | 9:48 PMUpdated Dec 13, 2023 | 12:12 AM

కరోనా తర్వాత సినిమాలతో పాటు క్రికెట్ మ్యాచుల్ని కూడా ఓటీటీల్లో స్ట్రీమ్ చేసేవారి సంఖ్య పెరిగింది. అయితే రానురానూ ఈ కంపెనీల మధ్య పోటీ పెరుగుతూ పోతోంది.

కరోనా తర్వాత సినిమాలతో పాటు క్రికెట్ మ్యాచుల్ని కూడా ఓటీటీల్లో స్ట్రీమ్ చేసేవారి సంఖ్య పెరిగింది. అయితే రానురానూ ఈ కంపెనీల మధ్య పోటీ పెరుగుతూ పోతోంది.

  • Published Dec 12, 2023 | 9:48 PMUpdated Dec 13, 2023 | 12:12 AM
Reliance: అంబానీ చేతికి డిస్నీ ప్లస్ హాట్​స్టార్! చేతులారా చేసుకున్న డిస్నీ!

ఒకప్పుడు క్రికెట్ చూడటం అంటే చాలా కష్టంగా ఉండేది. టికెట్లు దొరికితే స్టేడియానికి దగ్గరి నగరాల్లో ఉండే ప్రజలు లైవ్ చూసేవారు. కానీ ఇంట్లో నుంచి మ్యాచులు చూడటం చాలా ఇబ్బందిగా ఉండేది. దీని కోసం మొదట్లో రేడియోలు, ఆ తర్వాత టీవీల మీదే అందరూ ఆధారపడేవారు. జెంటిల్మన్ గేమ్​ను అమితంగా ఇష్టపడే అభిమానులు అప్పట్లో రేడియోల్లో క్రికెట్ కామెంట్రీ వింటూ మ్యాచ్​ను లైవ్​గా చూసిన అనుభూతిని పొందేవారు. టెలివిజన్ వాడకం పెరిగిన తర్వాత క్రమంగా రేడియోల్లో కామెంట్రీ వినేవారి సంఖ్య తగ్గిపోయింది. అయితే టీవీలు అందరి ఇళ్లలోనూ ఉండేవి కాదు. కాలం గడిచేకొద్దీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్స్​లోకి మారిపోయాయి టీవీలు. టెలివిజన్ పరిశ్రమలో పోటీ పెరిగిపోవడంతో తక్కువ ధరకే వస్తుండటంతో అందరూ వాటిని కొనసాగారు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ లవర్స్ మ్యాచుల్ని టీవీల్లోనే చూస్తూ వచ్చారు. కానీ డిజిటల్ విప్లవం, కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేయడంతో సినిమాల దగ్గర నుంచి వెబ్​సిరీస్​లు, లైవ్ క్రికెట్ మ్యాచ్ వరకు అన్నింటినీ ఓటీటీల్లో స్ట్రీమ్ చేసుకోవచ్చు. దీంతో డిస్నీ ప్లస్ హాట్​స్టార్, నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో సినిమా లాంటి ఓటీటీ ప్లాట్​ఫామ్స్ బాగా పాపులర్ అయ్యాయి. అదే టైమ్​లో వీటి మధ్య కాంపిటీషన్ కూడా మొదలైంది. ముఖ్యంగా క్రికెట్ మ్యాచుల విషయంలో ఇదీ మరీ ఎక్కువైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్​) రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచుల్ని స్ట్రీమింగ్ చేస్తూ భారీగా యూజర్లను పెంచుకున్న సంస్థగా హాట్​స్టార్​ను చెప్పుకోవచ్చు.

క్రికెట్​తో పాటు ప్రో కబడ్డీ, ఫుట్​బాల్ లాంటి ఇతర లీగ్స్​ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా హాట్​స్టార్ బాగా పాపులర్ అయింది. అయితే ఎప్పుడైతే ఐపీఎల్ డిజిటల్ రైట్స్​ను చేజార్చుకుందో అప్పటి నుంచి ఈ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో నష్టాల్లోకి ఉన్న ఈ కంపెనీ మీద కన్నేసిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ దాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రిలయన్స్​లో హాట్​స్టార్​ను విలీనం చేసేందుకు రెండు సంస్థల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయట. ఒకవేళ ఈ రెండు కంపెనీలు విలీనమైతే రిలయన్స్ వాటా 51 శాతానికి చేరుకుంటుంది. అప్పుడు అతిపెద్ద షేర్ హోల్డర్​గా రిలయన్స్ నిలుస్తుంది. అంతేగాక మీడియా అండ్ ఎంటర్​టైన్​మెంట్ రంగంలో అతిపెద్ద కంపెనీగానూ రిలయన్స్ అవతరిస్తుంది.

విలీన బోర్డులో రిలయన్స్, హాట్​స్టార్​కు సమాన ప్రాతినిధ్యం ఉండనుందని సమాచారం. రెండు కంపెనీల నుంచి చెరో డైరెక్టర్ ఉంటారట. అయితే హాట్​స్టార్ త్వరలో కనుమరుగు కానుందనే వార్తలపై నెట్టింట ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఫ్రీగా సేవలు అందిస్తామంటూ జియో సినిమా ఆఫర్లు ఇచ్చి సక్సెస్ అయిందని.. దాన్ని తట్టుకోవడంలో హాట్​స్టార్ ఫెయిలైందని అంటున్నారు. ఎంత రిస్క్ తీసుకోనైనా ఐపీఎల్ రైట్స్ దక్కించుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని.. డిస్నీ సంస్థ చేజేతులా చేసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అంబానీ చేతికి హాట్​స్టార్ రానుందనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కింగ్ విరాట్ కోహ్లీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి