iDreamPost
android-app
ios-app

మరోసారి మంచి మనస్సు చాటుకున్న ప్రభాస్.. వారికి రూ.35 లక్షల విరాళం

రెబల్ స్టార్ కృష్ణం రాజు నుండి నటనను మాత్రమే కాదు. . వ్యక్తిత్వాన్ని వారసత్వంగా తీసుకున్నాడు ప్రభాస్. మర్యాదల్లోనే కాదు.. విరాళాల్లో కూడా గుప్త దానాలు చేస్తుంటాడు. తాజాగా మరోసారి మంచి మనస్సు చాటుకున్నాడు.

రెబల్ స్టార్ కృష్ణం రాజు నుండి నటనను మాత్రమే కాదు. . వ్యక్తిత్వాన్ని వారసత్వంగా తీసుకున్నాడు ప్రభాస్. మర్యాదల్లోనే కాదు.. విరాళాల్లో కూడా గుప్త దానాలు చేస్తుంటాడు. తాజాగా మరోసారి మంచి మనస్సు చాటుకున్నాడు.

మరోసారి మంచి మనస్సు చాటుకున్న ప్రభాస్.. వారికి రూ.35 లక్షల విరాళం

టాలీవుడ్ రారాజు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్. పేరులోనే కాదు.. తీరులో కూడా అతడు కింగే. అతిథి మర్యాదలతో, ముఖ్యంగా వెరైటీ ఫుడ్స్ వడ్డించి, లేదా తెప్పించి పెడతారని పేరుంది. అతడి తోటి నటులు కూడా ఇదే విషయాన్ని చెప్పుకుంటారు. టాలీవుడ్ నటులే కాదు బాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీ నటీనటులు కూడా ఇదే విషయాన్ని పలుమార్లు వెల్లడించారు. అలాగే ప్రభాస్ ఎన్నో గుప్త దానాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఏదైనా పెను విపత్తు జరిగినప్పుడు ఆర్థిక సాయం అందించడంలో ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్.

తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి భూరీ వితరణ చేసి.. మరోసారి తన కైండ్ హార్టెడ్‌ను కనబర్చారు డార్లింగ్. రూ. 35 లక్షల విరాళం అందించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది మే 4న డైరెక్టర్ డే నిర్వహిస్తోంది తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్. హైదరబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే చిరంజీవితో పాటు పలువురు అగ్ర హీరోలకు ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో ఈవెంట్‌కు రావాలని ప్రభాస్‌ను తెలగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు వెళ్లి ఆహ్వానించారు. వస్తానని మాట ఇవ్వడంతో పాటు సెలబ్రేషన్ నిమిత్తం భారీ విరాళాన్ని ప్రకటించారు

ఈ దర్శకుల సంఘానికి రూ. 35 లక్షలు డొనేట్ చేశారు ఈ పాన్ ఇండియన్ స్టార్. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి వెల్లడించారు. ఇంత డబ్బు ఇవ్వమన్నారని, తనకు కాల్ చేసి చెప్పారని దర్శకుల సమావేశంలో వెల్లడించారు మారుతి. ప్రభాస్‌తో పాటు కొంత మంది స్టార్ హీరోలు కూడా విరాళం అందించినట్లు పేర్కొన్నారు. దర్శకులే కాదు మరోసారి ప్రభాస్ మంచి మనస్సును పొగుడుతున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం కల్కి ఫినిష్ చేశాడు. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ తెరకెక్కుతోన్న సంగతి విదితమే. వీటి తర్వాత స్పిరిట్, సలార్ 2, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో మూవీ షురూ చేసినట్లు తెలుస్తోంది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap