iDreamPost

చంద్రబాబు అరెస్ట్ పై Jr.NTR స్పందించకపోవడానికి కారణాలు

చంద్రబాబు అరెస్ట్ పై Jr.NTR స్పందించకపోవడానికి కారణాలు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బైయిలుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు జరిగినప్పటి నుంచి టీడీపీ క్యాడర్, ఆ పార్టీ సానుభూతిపరులు, అభిమానులు అంతా చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ గొంతుచించుకుంటూనే ఉన్నారు. ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్లు చేస్తూనే ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు అరెస్టుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అసలు ఆ విషయమే జరగలేదన్నట్లుగా మౌనంగా ఉన్నాడు. తారక్ మౌనం టీడీపీ వర్గాలకు నచ్చలేదు. స్పందించే బాధ్యత నీకు లేదా అంటూ విమర్శిస్తున్నారు. అయితే అసలు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం.

అసలు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టుపై ఎందుకు స్పందించాలి? అనే సూటిప్రశ్న అడిగితే తెలుగుదేశం క్యాడర్ దగ్గర సమాధానం ఉండదనే చెప్పాలి. అసలు చంద్రబాబు అరెస్ట్ అయితే తారక్ కి స్పందించాల్సిన అవసరం ఏముంది? ఏదో అప్పు ఉన్నట్టు టీడీపీవాళ్లు అడుగుతున్నారు. తండ్రి అరెస్టు అయినందుకు నారా లోకేష్ స్పందించాలి, రోడ్డెక్కాలి. రాజకీయ అవసరాలు ఉన్న మిత్రపక్షాలు స్పందించాలి. రాజకీయ పబ్బం గడుపుకున్న నాయకులు నోరు తెరవాలి. అంతేగాని అసలు జూనియర్ ఎన్టీఆర్ కు ఏం అవసరం ఉంది? అసలు ఈ అరెస్టుతో తారక్ కి ఏం సంబంధం ఉంది? అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమానే రిలీజ్ కాకూడదని కుట్ర పన్నారు. “నిన్ను చూడాలని” సినిమా రిలీజ్ సమయంలో ఆ సినిమాకి అసలు థియేటర్స్ ఇవ్వొద్దు చేసిన ఫోన్స్ గురించి మర్చిపోయి ఉంటారా? అసలు “ఆది” సినిమా సక్సెస్ అయ్యే వరకు.. తారక్ మా వాడు అని బయటకి చెప్పుకొలేని బాబాయ్ లు, పెద్దనాన్నలు వీళ్లు. అంటే సక్సెస్ కాకపోయుంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ ని దరిదాపుల్లోకి అయినా రానిచ్చేవాళ్లు కూడా కాదేమో?

లక్ష్మీ ప్రణతికి జూనియర్ ఎన్టీఆర్ కి ఇస్తాం అన్నప్పుడు.. ఆ పెళ్లిని ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారు. వాడికి ఎందుకు మన అమ్మాయిని ఇస్తున్నారు అని చివరి వరకు.. పెళ్లి ఆపాలని చూసింది మీరు కాదా? వల్లభనేని వంశీకి MLA టికెట్ ఇస్తూ.. నువ్వు తారక్ తో మాట్లాడకూడదు అని ఒట్టు వేయించుకున్నారని స్వయంగా వంశీనే వెల్లడించాడు. 2014లో అధికారంలోకి వచ్చాక.. ప్రమాణస్వీకారం రోజు జూనియర్ ఎన్టీఆర్ ని కనీసం స్టేజ్ పైకి కూడా పిలవలేదు. ఇన్నేళ్లుగా అట్టహాసంగా నిర్విహించుకుంటున్న మహానాడుకి.. మాట వరుసకి కూడా ఒక్కసారి కూడా ఆహ్వానం పంపలేదు. తారక్ పార్టీలో ఉంటే.. కన్న కొడుకు ఎదుగుదలకు ఎక్కడ అడ్డంకి అవుతాడో అని.. పార్టీకి దూరం పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడకండి అని మెసేజ్ లు ఫార్వర్డ్ చేసుకున్నారు. పని కట్టుకుని తారక్ సినిమాలు ఫ్లాపులు కావాలని కృషి చేశారు. హరికృష్ణకు నివాళులర్పించేందుకు వచ్చి.. సాక్షాత్తూ ఆయన పార్థీవదేహం సాక్షిగా.. KTRతో రాజకీయం చేయాలని చూశారు.

మా పార్టీకి సినిమా వాళ్ళు అవసరం లేదని.. బాహాటంగా స్టేట్మెంట్లు పాస్ చేసిన వారిలో ఇప్పుడు పస లేదు కాబట్టి.. ఈరోజు తారక్ అవసరం అయ్యాడు అంటారా? పార్టీ ప్రచారం కోసం విచ్చలవిడిగా వాడుకుని.. వాడు ప్రచారం చేశాడు కాబట్టే.. 2009లో ఓడిపోయాము అంటూ విమర్శలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా స్మారక నాణెం విడుదల చేస్తూ.. కార్యక్రమానికి హాజరు కావాలని ఆ కమిటీ ఛైర్మన్ తో ఆహ్వానం పంపారు. అంటే ఇది కుటుంబ కార్యక్రమం అయినప్పుడు ఎన్టీఆర్ ఆహ్వానించేందుకు కుటుంబ సభ్యులు కరువయ్యారా? అసలు చంద్రబాబు అరెస్టుపై దేనికి తారక్ స్పందించాలి? జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబు అరెస్టుపై స్పందించక పోవడానికి కారణాలు ఇవే అంటూ వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తారక్ స్పందించడానికి ముందు.. ఈ ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం, బంధుగణం, కార్యకర్తలు, అభిమానులు సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి.. తారక్ స్పందించకపోవడానికి చెప్పిన కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి