iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్‌ వికెట్‌ కీపింగ్‌ చేస్తాడని తెలుసా? కానీ, ఎందుకు కొనసాగించలేదంటే?

  • Published Jan 20, 2024 | 10:49 AM Updated Updated Jan 20, 2024 | 11:11 AM

భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్‌ శర్మ పేరు కచ్చితంగా ఉంటుంది. విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడాలంటే రోహిత్‌ తర్వాతే ఎవరైనా.. అయితే రోహిత్‌ ఒకప్పుడు వికెట్‌కీపర్‌ అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే.. రోహిత్‌ వికెట్‌ కీపింగ్‌ ఎందుకు వదిలేశాడో కూడా చాలా మందికి తెలియదు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్‌ శర్మ పేరు కచ్చితంగా ఉంటుంది. విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడాలంటే రోహిత్‌ తర్వాతే ఎవరైనా.. అయితే రోహిత్‌ ఒకప్పుడు వికెట్‌కీపర్‌ అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే.. రోహిత్‌ వికెట్‌ కీపింగ్‌ ఎందుకు వదిలేశాడో కూడా చాలా మందికి తెలియదు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 20, 2024 | 10:49 AMUpdated Jan 20, 2024 | 11:11 AM
Rohit Sharma: రోహిత్‌ వికెట్‌ కీపింగ్‌ చేస్తాడని తెలుసా? కానీ, ఎందుకు కొనసాగించలేదంటే?

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎంతటి విధ్వంసకర బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన రోజున క్రికెట్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులను సైతం బద్దలుకొట్టగల సమర్థుడు. ఆ విషయం అనేకసార్లు ప్రూవ్‌ అయింది. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఓ ఆటగాడు 264 పరుగులు చేస్తాడని ఎవరూ కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. కానీ, రోహిత్‌ చేసి చూపించాడు. ఏకంగా మూడు సార్లు వన్డేల్లో డబుల్‌ సెంచరీ బాదాడు. ఇక టీ20ల్లో ఏకంగా ఐదు సెంచరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. అయితే.. బ్యాటింగ్‌లో ఎన్నో ఘనతలు అందుకున్న రోహిత్‌ శర్మ స్పిన్‌ బౌలింగ్‌ వేస్తాడని చాలా మందికి తెలుసు. కెరీర్‌ ఆరంభంలో రోహిత్‌ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా కూడా కనిపించేవాడు.

అయితే.. రోహిత్‌ శర్మలో చాలా మందికి తెలియని మరో యాంగిల్‌ కూడా ఉంది. అదేంటంటే.. రోహిత్‌ శర్మ ఒక వికెట్‌ కీపర్‌ కూడా. ఈ విషయం చాలా మంది క్రికెట్‌ వీరాభిమానులకు కూడా తెలియదు. రోహిత్‌ శర్మ రంజీలు ఆడకముందు వికెట్‌ కీపర్‌గానూ చేశాడు. అయితే.. కాల క్రమంలో బ్యాటింగ్‌పైనే పూర్తి ఫోకస్‌ పెట్టి.. వికెట్‌ కీపింగ్‌ను వదిలేశాడు. ఒకరకంగా రోహిత్‌ శర్మకు అది ప్లస్‌ అయిందనే చెప్పాలి. వికెట్‌ కీపర్‌గా కొనసాగి ఉంటే.. రోహిత్‌ శర్మకు టీమిండియాలో చోటు దక్కడం కష్టమయ్యేది. ఎందుకంటే.. రోహిత్‌ టీమిండియాలోకి వచ్చే సమయానికి ధోని వికెట్‌ కీపర్‌ కమ్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా సెట్‌ అయిపోయి ఉన్నాడు. ధోని కారణంగా.. దినేష్‌ కార్తీక్‌ లాంటి టాలెంటెడ్‌ వికెట్‌ కీపర్లే అవకాశం లేకుండా పోయింది.

Why didn't Rohit continue as a keeper

అలాంటిది రోహిత్‌ శర్మ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కోటాలో టీమిండియాలో చోటు కోసం ప్రయత్నించి ఉంటే.. ఇప్పుడు ఒక అనమాక ప్లేయర్‌గా మిగిలిపోయేవాడు. నిఖార్సయిన బ్యాటర్‌గా ప్రయత్నించడంతోనే జట్టులో స్థానం దక్కింది. ముందు లోయర్‌ ఆర్డర్‌లో తర్వాత మిడిల్డార్‌ ఆర్డర్‌లో.. ఆ తర్వాత ఓపెనర్‌గా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవడమే కాకుండా.. కెప్టెన్‌ కూడా అ‍య్యాడు. అయితే ఇంత ఘనత సాధించేందుకు ఒక నిర్ణయం రోహిత్‌కు బాగా కలిసివచ్చింది. అదే.. వికెట్‌ కీపింగ్‌పై పెద్దగా కాన్సట్రేషన్‌ చేయకుండా.. బ్యాటింగ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టడంతో ఈ రోజు ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా, కెప్టెన్‌గా ఉన్నాడు. మరి రోహిత్‌ శర్మ వికెట్‌ కీపింగ్‌ వదిలేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.