Tirupathi Rao
Sri Rama Navami 2024: సీతాసమేత రామ్యయకు శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా కల్యాణం నిర్వహిస్తారు. ఆ తర్వాత నైవేధ్యంగా పానకం పెడతారు. అలాగే భక్తులకు కూడా ప్రసాదం కింద పానకం పోస్తారు. అయితే పానకమే ఎందుకు ప్రసాదంగా ఇస్తారో తెలుసా?
Sri Rama Navami 2024: సీతాసమేత రామ్యయకు శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా కల్యాణం నిర్వహిస్తారు. ఆ తర్వాత నైవేధ్యంగా పానకం పెడతారు. అలాగే భక్తులకు కూడా ప్రసాదం కింద పానకం పోస్తారు. అయితే పానకమే ఎందుకు ప్రసాదంగా ఇస్తారో తెలుసా?
Tirupathi Rao
భారతీయులకు.. అందులోనూ హిందువులకు శ్రీరామ నవమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీరామ నవమి భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో వైభవంగా ఈ పండుగను నిర్వహిస్తారు. అలాగే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. అయితే మనం ప్రతి పండుగకు ఒక విశిష్టమైన, ప్రత్యేకమైన ప్రసాదాన్ని దేవుడికి నైవేధ్యంగా పెడుతూ ఉంటాం. ఉగాదికి షడ్రుచులతో ఉగాది పచ్చడి, వినాయక చవితికి ఉండ్రాళ్లు, అలాగే రాములోరికి పానకాన్ని నైవేధ్యంగా పెడతారు. అయితే ఎందుకు పానకమే నైవేధ్యంగా పెడతారు అని ఎప్పుడైనా అనుమానం వచ్చిందా?
శ్రీరామ నవమిని భారతదేశంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో ఆ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుపుతారు. ఆ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని భక్తులు పరవశించిపోతారు. అందరూ ఇళ్లల్లో కూడా శ్రీరామ నవమిని చేసుకుంటారు. ఆ సీతారాములను ఎంతో భక్తి శ్రద్ధలతో తులసీ దళాలతో పూజిస్తారు. అయితే ఇంట్లో అయినా.. గుడిలో అయినా శ్రీరామ నవమికి నైవేధ్యంగా వడపప్పు, పానకాన్ని పెడతారు. అయితే పానకాన్ని ఇవ్వడం వెనుక శాస్త్రంలో చాలానే కారణాలు ఉన్నాయి. వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన మర్మం కూడా ఉంది. అందుకే పానకాన్ని ప్రసాదంగా ఇస్తారు.
ఉగాది అయిపోయాక చలి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత నుంచి ఎండలు ప్రారంభమవుతాయి. సూర్యూడు తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. అలా ఎండలు మొదలైన తర్వాత శ్రీరామ నవమి వస్తుంది. అందుకే గుళ్ల దగ్గర తాటాకు పందిళ్లు వేస్తారు. ఎందుకంటే వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు అని. అలాగే ప్రసాదంగా ఇచ్చే పానకం కూడా భక్తులకు శక్తిని, శరీరంలో ఉన్న వేడిని తొలగించడానికి ఇస్తారు. పానకం తయారు చేయడానికి వాడే వస్తువులు చూస్తే అర్థమవుతుంది. పానకం కోసం బెల్లం, మంచినీళ్లు, మిరియాలు, యాలకులు, తులసి ఆకులు వాడతారు. ఈ పానకం మనిషి ఒంట్లో ఉన్న ఉష్ణాన్ని తగ్గించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది.
బెల్లం వేడిని తగ్గించడమే కాకుండా అందులో ఉన్న ఐరన్ శరీరానికి శక్తిని ఇస్తుంది. మిరియాలు కఫం, గొంతునొప్పిని తగ్గిస్తాయి. దగ్గు రాకుండా ఉండేలా చేస్తాయి. అలాగే తులసి ఆకులు వేసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. అవి వైరస్ ద్వారా వచ్చే వ్యాధులను అరికడుతుంది. వేసవి ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇలా పానకం తాగుతారని పురాణాలు చెబుతున్నాయి. పానకాన్ని ప్రసాదంగా తీసుకోవడం వల్ల భక్తికి భక్తి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఎవరైనా పిల్లలు పానకం తాగనని మారం చేస్తే.. దాని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను అర్థమయ్యేలా వివరించండి. ఈ విషయాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి.