iDreamPost

వీడియో: కారు అద్దాలు పగలగొట్టిన ఆర్సీబీ క్రికెటర్.. ఇది నెక్స్ట్ లెవల్ హిట్టింగ్!

  • Published Mar 05, 2024 | 9:31 AMUpdated Mar 05, 2024 | 9:31 AM

నెక్స్ట్ లెవల్ హిట్టింగ్​తో రెచ్చిపోయిందో ఆర్సీబీ క్రికెటర్. ఆమె కొట్టిన ఓ షాట్​కు ఏకంగా కారు అద్దాలు పగిలాయి. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..

నెక్స్ట్ లెవల్ హిట్టింగ్​తో రెచ్చిపోయిందో ఆర్సీబీ క్రికెటర్. ఆమె కొట్టిన ఓ షాట్​కు ఏకంగా కారు అద్దాలు పగిలాయి. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 05, 2024 | 9:31 AMUpdated Mar 05, 2024 | 9:31 AM
వీడియో: కారు అద్దాలు పగలగొట్టిన ఆర్సీబీ క్రికెటర్.. ఇది నెక్స్ట్ లెవల్ హిట్టింగ్!

విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 చాలా ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. అద్భుతమైన బ్యాటింగ్, సూపర్బ్ బౌలింగ్​తో మహిళా క్రికెటర్లు ఆడియెన్స్​కు మస్తు వినోదాన్ని పంచుతున్నారు. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫుల్ స్వింగ్​లో ఉంది. వరుస విజయాలతో ఆ టీమ్ దుమ్మురేపుతోంది. ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ స్మృతి సేన దూసుకుపోతోంది. వారియర్జ్ టీమ్​తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్​లో 23 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది ఆర్సీబీ. అయితే ఈ మ్యాచ్​లో ఓ బెంగళూరు బ్యాటర్ కొట్టిన బాల్ దెబ్బకు ఏకంగా కారు అద్దం ధ్వంసమైంది. ఆ షాట్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వారియర్జ్​తో మ్యాచ్​లో తొలుత ఆర్సీబీ బ్యాటింగ్​కు దిగింది. ఆ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (80) టాప్ స్కోరర్​గా నిలిచింది. అలీసా పెర్రీ (55), దీప్తి శర్మ (33), పూనమ్ ఖేమ్నర్ (31) కూడా రాణించారు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్​లో పెర్రీ బ్యాటింగ్, అందులోనూ ఆమె బాదిన భారీ సిక్స్ స్పెషల్ హైలైట్​గా నిలిచింది. మిడ్ వికెట్​లో పడిన బాల్​ను డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్​గా తరలించింది. ఆమె షాట్ కొట్టగానే అంతా అది సిక్స్ అనే అనుకున్నారు. అయితే ఆ బాల్ ఏకంగా స్టాండ్స్​లో పార్క్​ చేసి ఉన్న కారు అద్దానికి బలంగా తాకింది. బాల్ తగిలిన స్పీడ్​కు ఆ అద్దం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో ఆర్సీబీ డగౌట్​లో కూర్చున్న ప్లేయర్లు అంతా ఫుల్​ సెలబ్రేట్ చేసుకున్నారు.

సిక్స్ దెబ్బకు కారు అద్దం పగలడంతో షాట్ కొట్టిన ఎలిస్ పెర్రీ డిఫరెంట్​గా రియాక్ట్ అయింది. అయ్యో.. ఎంత పనైంది అంటూ తల మీద చేయి వేసి బాధపడుతూ కనిపించింది. పెర్రీ సిక్స్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఇదేం బాదుడు భయ్యా అని షాకవుతున్నారు. పెర్రీ మాస్ హిట్టింగ్ వేరే లెవల్ అని చెబుతున్నారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్​ అవార్డుపై కన్నేసిందని.. అందుకే ఆమె ఆ కారు అద్దాన్ని బ్రేక్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో ఆర్సీబీ విసిరిన 198 పరుగుల టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన వారియర్జ్ 175 పరుగులకే పరిమితమైంది. మరి.. పెర్రీ బ్యాటింగ్​పై మీ ఒపీనియన్​ను​ కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఐపీఎల్-2024​కు ముందు ధోని ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కెప్టెన్సీకి గుడ్​బై?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి