iDreamPost
android-app
ios-app

RCB బలం, బలహీనతలు! అమ్మాయిల నుంచి స్ఫూర్తి పొందుతారా?

  • Published Mar 21, 2024 | 12:22 PM Updated Updated Mar 21, 2024 | 12:22 PM

16 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ కప్పును ఈసారైనా కైవసం చేసుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో డుప్లెసిస్ సేన బలం, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

16 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ కప్పును ఈసారైనా కైవసం చేసుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో డుప్లెసిస్ సేన బలం, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 21, 2024 | 12:22 PMUpdated Mar 21, 2024 | 12:22 PM
RCB బలం, బలహీనతలు! అమ్మాయిల నుంచి స్ఫూర్తి పొందుతారా?

ఐపీఎల్​లో అత్యంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్​గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి అందరూ గొప్పగా చెబుతుంటారు. 16 ఏళ్లుగా ఒక్క ట్రోఫీ నెగ్గకున్నా ఆర్సీబీకి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూనే చేస్తుండటమే దీనికి కారణం. తమ జట్టు ఎప్పటికైనా ట్రోఫీ నెగ్గకపోదా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి బెంగళూరులో చాలా మారాయి. ఆ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 టైటిల్​ను ఆర్సీబీ మహిళల జట్టు గెలుచుకుంది. దీంతో బెంగళూరు అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెన్స్ టీమ్ కూడా ఐపీఎల్​ కప్పును కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బలం, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

బలం

ఆర్సీబీకి అతిపెద్ద బలం బ్యాటింగ్ యూనిట్ అనే చెప్పాలి. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్​వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. గత సీజన్​కు మిస్సయిన పాటిదార్ ఈసారి జట్టుతో కలవడం కలిసొచ్చే అంశం. మినీ ఆక్షన్​లో ముంబై నుంచి గ్రీన్​ను దక్కించుకుంది బెంగళూరు. ఓపెనర్​గా అద్భుతంగా రాణిస్తున్న కామెరాన్ జట్టుకు బిగ్ ప్లస్ కానున్నాడు. అతడు బాల్​తో కూడా ప్రభావం చూపగలగడం అదనపు బలంగా చెప్పొచ్చు. ఎలాంటి స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్ అయినా ఆర్సీబీ బ్యాటర్లకు బౌలింగ్ చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఓపెనింగ్​లో డుప్లెసిస్​కు జోడీగా గ్రీన్ వస్తాడని అంటున్నారు. అగ్నికి ఆయువు తోడైనట్లు ఫాఫ్​కు వీర ఫామ్​లో ఉన్న కామెరాన్ జతైతే ప్రత్యర్థులకు దబిడిదిబిడే.

బలహీనతలు

బెంగళూరు బౌలింగ్ అటాక్ బలహీనంగా ఉంది. ముఖ్యంగా స్పిన్ యూనిట్​లో పస కనిపించడం లేదు. కర్ణ్​ శర్మ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. అతడికి తోడుగా మయాంక్ డగర్, స్వప్నిల్ సింగ్ లాంటి యంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్లకు పెద్దగా అనుభవం లేదు. మాక్స్​వెల్ రూపంలో స్పిన్​ బౌలింగ్​లో ప్రత్యామ్నాయం కనిపిస్తున్నా అతడ్ని ఆర్సీబీ పెద్దగా వాడుకున్న దాఖలాలు లేవు. ఆ జట్టు పేస్ అటాక్ కూడా ఏమంత గొప్పగా లేదు. మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, రీస్ టోప్లే, యష్​ దయాల్ ఆ టీమ్ పేసర్లు. అయితే టోప్లే ఫిట్​గా లేడు. ఫెర్గూసన్ నిత్యం గాయాలతో సావాసం చేస్తుంటాడు. దీంతో సిరాజ్ ఒక్కడే లీథల్ పేసర్​గా కనిపిస్తున్నాడు. అతడికి తోడు జోసెఫ్, దయాల్ బాగా రాణించాలి లేదంటే రన్స్ ఈజీగా లీక్ అవుతాయి.

గత రికార్డులు

ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా కప్పును ముద్దాడని టీమ్స్​లో ఆర్సీబీ ఒకటి. ఈ జట్టు నాలుగు సార్లు టోర్నీ ఫైనల్స్​కు చేరుకుంది. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీని చేజిక్కించుకోలేదు. చివరగా 2016లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ టోర్నీ ఫైనల్​కు చేరుకుంది. గతేడాది లీగ్ స్టేజ్​కే పరిమితమైన ఆర్సీబీ.. 2022లో టాప్-3​లో నిలిచింది.

విజయావకాశాలు

గత రికార్డులు, బలం, బలహీనతలను బట్టి ఆర్సీబీ ఈసారి ప్లేఆఫ్స్​కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బ్యాటింగ్ బలానికి తోడు బౌలింగ్​లో కూడా ఇద్దరు, ముగ్గురు కన్​సిస్టెంట్​గా రాణిస్తేనే ఇది సాధ్యమవుతుంది. డబ్ల్యూపీఎల్ నెగ్గిన అమ్మాయిల నుంచి స్ఫూర్తి పొంది కసిగా ఆడితే బెంగళూరు కప్పు ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇదీ చదవండి: ఆ టైమ్‌లో ఎమోషనల్‌ అయ్యా! తొలిసారి ఓపెన్‌ అయిన రోహిత్‌ శర్మ