iDreamPost
android-app
ios-app

Glenn Maxwell: బాధలోనూ మాక్స్ వెల్ గొప్ప నిర్ణయం.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్!

  • Published Apr 16, 2024 | 1:48 PM Updated Updated Apr 16, 2024 | 2:44 PM

ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత దారుణమైన ఫామ్ లో ఉన్నాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్. దీంతో తనకు తానుగానే ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే?

ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత దారుణమైన ఫామ్ లో ఉన్నాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్. దీంతో తనకు తానుగానే ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే?

Glenn Maxwell: బాధలోనూ మాక్స్ వెల్ గొప్ప నిర్ణయం.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్!

గ్లెన్ మాక్స్ వెల్.. ప్రపంచ క్రికెట్ లో విధ్వంసానికి మరోపేరు. అతడు క్రీజ్ లోకి వస్తే చాలు ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అంతలా తన ప్రతాపం చూపిస్తాడు. అయితే ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ప్రస్తుతం మాక్సీ అత్యంత దారుణమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఇంత బాధలో ఉన్నా.. గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మాక్సీ. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ అతడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే?

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అతడు తాజాగా గొప్ప డెసిషన్ తీసుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ నుంచి నిరవధిక విరామం తీసుకోనున్నట్లు స్వయంగా ప్రకటించాడు. శారీరక, మానసిక అలసట కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు మాక్సీ. అయితే ఈ రెస్ట్ ఎన్నిరోజులు అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతడు ఈ విషయాలను వెల్లడించాడు.

Maxi is a great decision even in pain!

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో తనను తప్పించమని స్వయంగా మాక్స్ వెల్ వెళ్లి కెప్టెన్ డుప్లెసిస్ ను, కోచ్ ను అడిగాడు. తన ప్లేస్ లో మరో యువ ఆటగాడికి చోటు కల్పించాలని కోరాడు మాక్సీ. దీంతో అతడి నిర్ణయాన్ని గౌరవించి.. ఈ మ్యాచ్ కు తీసుకోలేదు. అయితే ఎన్ని మ్యాచ్ లకు దూరంగా ఉంటాడు అన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సీజన్ లో మాక్స్ వెల్ అత్యధిక స్కోర్ 28 అంటే నమ్ముతారా? మూడు డకౌట్లతో 32 రన్స్ మాత్రమే చేసి.. జట్టుకు భారంగా మారాడు. దీంతో తనకు కొంత విరామం కావాలని భావించి.. టీమ్ నుంచి తప్పుకున్నాడు. అయితే గత సీజన్లలో మాత్రం ఆర్సీబీ తరఫున మెరుపులు మెరిపించాడు. 2021లో 513, 2022లో 301, 2023 సీజన్ లో 400 పరుగులు సాధించాడు. ఫామ్ లో లేనన్న సంగతి తెలిసి.. తన ప్లేస్ లో మరో ప్లేయర్ కు అవకాశం ఇవ్వమన్న మాక్సీ గొప్ప మనసు చూసి.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి తన ప్లేస్ లో మరో ఆటగాడిని తీసుకోమని స్వయంగా తప్పుకున్న మాక్స్ వెల్ గొప్ప నిర్ణయం మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.