iDreamPost

RCB vs GT: విరాట్‌ కోహ్లీ తన కెరీర్‌లో తొలిసారి ఇంత భయంకరంగా ఆడాడు!

  • Published May 05, 2024 | 2:35 PMUpdated May 05, 2024 | 2:35 PM

Virat Kohli, RCB vs GT, IPL 2024: కోహ్లీ కెరీర్‌లో ఇలాంటి విధ్వంసకరంగా ఎప్పుడూ ఆడలేదు. గుజరాత్‌పై తన కెరీర్‌లో ఇంత కసిగా ఆడాడు. మరి కోహ్లీ ఇంత కోసంగా ఆడేందుకు కారణం ఏంటి? సాధించిన రికార్డ్‌ ఏంటి ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, RCB vs GT, IPL 2024: కోహ్లీ కెరీర్‌లో ఇలాంటి విధ్వంసకరంగా ఎప్పుడూ ఆడలేదు. గుజరాత్‌పై తన కెరీర్‌లో ఇంత కసిగా ఆడాడు. మరి కోహ్లీ ఇంత కోసంగా ఆడేందుకు కారణం ఏంటి? సాధించిన రికార్డ్‌ ఏంటి ఇప్పుడు చూద్దాం..

  • Published May 05, 2024 | 2:35 PMUpdated May 05, 2024 | 2:35 PM
RCB vs GT: విరాట్‌ కోహ్లీ తన కెరీర్‌లో తొలిసారి ఇంత భయంకరంగా ఆడాడు!

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్‌ విక్టరీ కొట్టింది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో గెలిచి.. ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. ఈ సీజన్‌లో చాలా రోజులుగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ఇప్పుడు 7వ స్థానానికి ఎగబాకింది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఎప్పుడూ లేనంత కసిగా బ్యాటింగ్ చేశాడు. గుజరాత్‌ నిర్దేశించిన 148 పరుగుల టార్గెట్‌ను వీలైనంత త్వరగా ఛేజ్‌ చేసి.. రన్‌రేట్‌ మెరుగుపర్చుకోవాలనే ప్లాన్‌తో ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ, డుప్లిసిస్‌ బ్యాటింగ్‌కు దిగారు. ప్లాన్‌కు తగ్గట్లు తొలి ఓవర్‌లోనే కోహ్లీ రెండు భారీ సిక్సులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత డుప్లెసిస్‌ కూడా ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు.

వీరిద్దరు సృష్టించిన విధ్వంసంతో పవర్‌ ప్లేలో ఆర్సీబీ అత్యధిక పరుగుల రికార్డును నెలకొల్పింది. 6 ఓవర్లలో 92 పరుగులు చేసింది. పవర్‌ ప్లేలో ఇదే ఆర్సీబీకి అత్యధిక స్కోర్‌. డుప్లెసిస్‌ 23 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సులతో 64 పరుగులు, విరాట్‌ కోహ్లీ 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సులతో 42 పరుగులు చేసి అదరగొట్టారు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లీ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఫోర్‌ కొట్టకుండా.. కోహ్లీ ఎప్పుడు నాలుగు సిక్సులు కొట్టలేదు. కోహ్లీ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన తర్వాత.. ఫోర్లు కొట్టకుండా.. కేవలం సిక్సులతో ఇన్నింగ్స్‌ను నడిపించలేదు. తొలిసారి ఫోర్లు లేకుండా.. ఫస్ట్‌ నాలుగు సిక్సులు కొట్టాడు. గతంలో కోహ్లీ ఎప్పుడూ ఇంత అగ్రెసివ్‌గా ఇన్నింగ్స్‌ ను స్టార్ట్‌ చేయలేదు.

కాగా, ఇటీవల విరాట్‌ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కోహ్లీ పరుగులు చేస్తున్నప్పటికీ చాలా స్లోగా బ్యాటింగ్‌ చేస్తున్నాడంటూ.. మాజీ క్రికెటర్లు సైతం విమర్శించాడు. టీ20 వరల్డ్‌ కప్‌లో ఇలాంటి స్ట్రైక్‌రేట్‌తో ఆడితే లాభం లేదని అన్నారు. ఈ విషయంపై విరాట్‌ కోహ్లీ కూడా స్పందిస్తూ.. తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. కేవలం మాటతోనే కాకుండా బ్యాట్‌తో కూడా జవాబు చెప్పాడు కోహ్లీ. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచి సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఫోర్లుకు ఎక్కువగా కొట్టే కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఒక్క ఫోర్‌ కూడా కొట్టకముందే.. నాలుగు సిక్సులు బాదాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 42 పరుగులు చేసి అసలు సిసలు టీ20 ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. మరి కోహ్లీ ఇలా ఇన్నింగ్స్‌ స్టార్టింగ్‌లో ఫోర్‌ లేకుండా నాలుగు సిక్సులు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి