Somesekhar
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నాను. ప్రూప్స్ తో సహా తమ టీమ్ కు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నాను. ప్రూప్స్ తో సహా తమ టీమ్ కు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
IPL 2024 సీజన్ లో భాగంగా ముంబై-ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఎంఐ బ్యాటర్ల విజృంభించడంతో బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో RCBకి తీవ్ర అన్యాయం జరిగిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఆ నాలుగు సంఘటనలు ముంబై ఇండియన్స్ టీమ్ కు ఫేవర్ గా ఇచ్చారు అంపైర్లు. దీంతో ఆర్సీబీ ఓడిపోయిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్సీబీకి జరిగిన అన్యాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబైతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఒక విధంగా వారు చేసే ఆరోపణల్లో నిజం ఉందనే అనిపిస్తుంది. ఎందుకంటే? ఈ మ్యాచ్ లో అంపైర్లు పూర్తిగా ముంబై ఇండియన్స్ టీమ్ కే సపోర్ట్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఈ మ్యాచ్ లో నాలుగు సార్లు అంపైర్లు ముంబైకి అనుకూలంగా నిర్ణయాలు ఇచ్చారు. అవేంటంటే? ఆర్సీబీ బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ ను బుమ్రా ఎల్బీగా అవుట్ చేశాడు. ఈ ఔట్ లో ఆర్సీబీకి అన్యాయం జరిగింది. దీంతో పాటుగా బెంగళూరు ప్లేయర్ కొట్టిన ఓ బాల్ ను ముంబై ఫీల్డర్ ఆపే క్రమంలో అతడు బౌండరీ లైన్ ను తాకాడు. కానీ అంపైర్లు ఫోర్ మాత్రం ఇవ్వలేదు.
కాగా.. ఇక్కడితో బెంగళూరు టీమ్ కు జరిగిన అన్యాయాలు అయిపోలేదు. చివరి ఓవర్లో దినేశ్ కార్తిక్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఆకాశ్ మధ్వాల్ హైట్ బాల్ వేశాడు. నిబంధనల ప్రకారం అది హైట్ నోబాల్. కానీ ఫీల్డ్ అంపైర్లు దాన్ని నోబాల్ గా ప్రకటించలేదు. ఇది ఆ టీమ్ కు పెద్ద లాస్. ఇదిలా ఉండగా.. ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వైడ్ కాని బాల్ ను సైతం వైడ్ ప్రకటించారు అంపైర్లు. దీంతో ముంబైకి అదనంగా మరో పరుగు వచ్చింది. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా.. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమికి పై రీజన్స్ తోడైయ్యాయి. దీంతో అంపైర్లను అంపైర్ ఇండియన్స్ అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న బెంగళూరు టీమ్ కు అంపైర్లు శాపంగా మారారు. మరి ఈ మ్యాచ్ లో బెంగళూరు టీమ్ కు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.