iDreamPost

MI vs RCB: DK మెరుపు బ్యాటింగ్.. రోహిత్ నెక్ట్స్ లెవల్ టీజ్! ఆ మాటలు వినాల్సిందే..

దినేశ్ కార్తిక్ ను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేశాడు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలేం జరిగిందంటే?

దినేశ్ కార్తిక్ ను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేశాడు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలేం జరిగిందంటే?

MI vs RCB: DK మెరుపు బ్యాటింగ్.. రోహిత్ నెక్ట్స్ లెవల్ టీజ్! ఆ మాటలు వినాల్సిందే..

IPL 2024లో భాగంగా తాజాగ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచింది. తొలుత ఆర్సీబీ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తే.. ఆ తర్వాత ముంబై ప్లేయర్లు తుఫాన్ బ్యాటింగ్ తో చెలరేగి 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే దంచికొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో దినేశ్ కార్తిక్ ను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేశాడు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలేం జరిగిందంటే?

రోహిత్ శర్మలో కెప్టెన్సీ నుంచి దూరమైన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ప్రాక్టీస్ లో మ్యాచ్ లో ఎంతో సరదాగా ఉంటూ.. సహచర ప్లేయర్లను ఆటపట్టిస్తూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాడు. ఇక తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ను టీజ్ చేసిన విధానం నెక్ట్స్ లెవల్ అంటున్నారు క్రికెట్ ప్రేమికులు. ఈ మ్యచ్ లో డీకే పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 53 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

మరీ ముఖ్యంగా ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్ లో డీకే కొట్టిన నాలుగు బౌండరీలు ఐపీఎల్ కే హైలెట్ అని చెప్పాలి. ఒకే ఏరియాలో 4 ఫోర్లు బాదాడు డీకే. కాగా.. బుమ్రా వేసిన 19వ ఓవర్ లో ఆఖరి బంతిని దినేశ్ కార్తిక్ సిక్సర్ గా మలిచాడు. ఇది చూసిన రోహిత్ అతడి దగ్గరికి వచ్చి మెచ్చుకుంటూ.. తనదైన స్టైల్లో టీజ్ చేశాడు. హిట్ మ్యాన్ అన్న మాటలు స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి. ఇంతకీ రోహిత్ ఏమన్నాడంటే? “శభాష్ డీకే.. టీ20 వరల్డ్ కప్ లో ఆడేందుకే ఇలా విధ్వంసం సృష్టిస్తున్నావ్ కదా?” అంటూ నవ్వుతూ టీజ్ చేశాడు. ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

దినేశ్ కార్తిక్ సైతం టీ20 ప్రపంచ కప్ లో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. డుప్లెసిస్(61), రజత్ పాటిదార్(50), డీకే(53*) పరుగులతో రాణించారు. అనంతరం 197 టార్గెట్ ను కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే దంచికొట్టింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(69), రోహిత్(38), సూర్యకుమార్(52) పరుగులతో రాణించారు. మరి డీకేని రోహిత్ టీజ్ చేయడం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి