Nidhan
ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. చెన్నైని చిత్తు చేసి దర్జాగా ప్లేఆఫ్స్ గడప తొక్కింది. ఈ తరుణంలో విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా ఆయన రాసిన స్క్రిప్టేనని అన్నాడు.
ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. చెన్నైని చిత్తు చేసి దర్జాగా ప్లేఆఫ్స్ గడప తొక్కింది. ఈ తరుణంలో విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా ఆయన రాసిన స్క్రిప్టేనని అన్నాడు.
Nidhan
విమెన్స్ టీమ్ టైటిల్ సాధించింది. వీళ్ల వల్ల కాదా? అని విమర్శించారు. కప్పు కొట్టలేరు సరే.. కనీసం ప్లేఆఫ్స్‌కైనా వెళ్తారా? లేదా? అని అవమానించారు. ఇంత చెత్తాట ఆడే బదులు బయటకు వచ్చేయొచ్చుగా అని ట్రోల్ చేశారు. కానీ తమను క్రిటిసైజ్ చేసిన వాళ్లకు ఆటతీరుతో సమాధానం చెప్పింది రాయల్ ఛాలెజంర్స్ బెంగళూరు. ఐపీఎల్-2024లో ఒక దశలో వరుస పరాజయాలతో తీవ్రంగా విమర్శలపాలైన ఆ టీమ్.. దాని నుంచి కోలుకొని సక్సెస్ బాట పట్టింది. వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్ గడప తొక్కింది. కింగ్ విరాట్ కోహ్లీ ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బ్యాట్‌తో అదరగొట్టడమే గాక ఫీల్డింగ్ టైమ్‌లోనూ సహచరుల్లో జోష్ నింపాడు. కెప్టెన్ డుప్లెసిస్‌కు అండగా నిలిచాడు.
ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచుల్లో 155 స్ట్రైక్ రేట్‌తో 708 పరుగులు చేశాడు కోహ్లీ. నిన్న కూడా 29 బంతుల్లో 47 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ స్కోరర్‌గా ఉన్న విరాట్ టోర్నీ ముగిసేవరకు ఇంకెన్ని పరుగులు చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంపై చాలా మంది సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకదశలో 1 శాతం అవకాశం ఉన్న జట్టు వరుసగా ఆరు మ్యాచుల్లో గెలిచి, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైని చిత్తు చేసి ప్లేఆఫ్స్‌లోకి దర్జాగా అడుగు పెట్టడం ఏంటని షాక్ అవుతున్నారు. ఈ విషయంపై కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. ఇదంతా ఆ దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నాడు. దీన్ని ఎవరూ మార్చలేరని చెప్పాడు.
‘దేవుడికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి. మనం కేవలం చేస్తున్న పని విషయంలో నిజాయితీగా ఉంటే సరిపోతుంది. ఆర్సీబీ ఆటగాళ్లంతా చాలా నిజాయితీగా ఆడారు. టీమ్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక వాళ్లందరి హార్డ్ వర్క్ ఉంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఒక దశలో తమ టీమ్ పనైపోయిందని అనుకొని బ్యాగులు కూడా సర్దుకున్నానని రివీల్ చేశాడు. అప్పుడే మిరాకిల్ జరిగిందన్నాడు. ఒక్కో మ్యాచ్‌ను లక్ష్యంగా పెట్టుకొని గెలిచేందుకు ప్రయత్నించామని, అది బాగా వర్కౌట్ అయిందన్నాడు. దూకుడు మంత్రం పని చేసిందన్నాడు కింగ్. ఏ ప్లేయర్ అయినా సరే మ్యాచ్‌లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలని.. మిగతాదంతా ఆ భగవంతుడు చూసుకుంటాడని కోహ్లీ పేర్కొన్నాడు. మరి.. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ కింగ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Virat Kohli said “God’s got the plan so you have just to be honest what you are doing. I think we are pretty honest with our hard work”. pic.twitter.com/DeKQC3XPLO
— Johns. (@CricCrazyJohns) May 19, 2024