iDreamPost

ఈ బ్యాంకు కస్టమర్లకు షాక్.. బ్యాంకు లైసెన్స్‌ రద్దుచేసిన RBI

ఈ బ్యాంకు కస్టమర్లకు షాక్.. బ్యాంకు లైసెన్స్‌ రద్దుచేసిన RBI

ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు నష్టపోవడం, దివాలా తీయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల్లోని ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమ కష్టార్జితాన్ని పొదుపు చేసి బ్యాంకుల్లో దాచుకుంటే ఇప్పుడు ఆ బ్యాంకుల వల్లనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ బ్యాంక్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ బ్యాంక్ లోని ఖాతాదారులకు షాక్ తగిలినట్లైంది. ఇంతకీ ఆ బ్యాంక్ ఏది? ఎందుకు లైసెన్స్ రద్దు చేశారు? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆర్బీఐ ముంబైకి చెందిన ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ రద్దు చేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను జారీ చేసింది. ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకుకు తగిన మూలధనం, ఆదాయ మార్గాలు లేనందున లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లను స్వీకారించడం, డిపాజిట్ల సొమ్మును తిరిగి చెల్లించడం లాంటి వాటిపై కూడా నిషేధం విధించింది.

ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. లిక్విడేషన్‌పై, ప్రతి డిపాజిటర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి రూ. 5 లక్షల ద్రవ్య పరిమితి వరకు అతని/ఆమె డిపాజిట్ల డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులని ఆర్బీఐ తెలిపింది . దాదాపు 96.09 శాతం మంది డిపాజిటర్లు డిఐసిజిసి నుండి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించేందుకు అర్హులని ఆర్బీఐ వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి