iDreamPost

రోహిత్ శర్మపై అశ్విన్ కామెంట్స్.. గతంలో ఇలా ఎన్నడూ చేయలేదనుకుంటా!

  • Author Soma Sekhar Published - 11:02 AM, Thu - 30 November 23

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Author Soma Sekhar Published - 11:02 AM, Thu - 30 November 23
రోహిత్ శర్మపై అశ్విన్ కామెంట్స్.. గతంలో ఇలా ఎన్నడూ చేయలేదనుకుంటా!

సాధారణంగా ఇటు సినిమా ఇండస్ట్రీలో గానీ, క్రీడా రంగంలో గానీ.. సెలబ్రిటీలు తమ తోటి నటీ, నటులపై సందర్భానుసారం కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కొంత మంది ప్రశంసిస్తే.. మరికొందరు బాహాటంగానే విమర్శిస్తూ ఉంటారు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. తన సహచర ఆటగాళ్లపై తరచుగా స్పందిస్తూ.. వార్తల్లో నిలుస్తుంటాడు. ఇక ఇప్పుడు మరోసారి హిట్ మ్యాన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ స్టార్ స్పిన్నర్. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. గతంలో అశ్విన్ ఇలాంటి కామెంట్స్ చేయలేదనుకుంటా అంటూ సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు నెటిజన్లు.

వరల్డ్ కప్ లో తనను ఒక్క మ్యాచ్ కే పరిమితం చేస్తారని ఊహించలేదని షాకింగ్ కామెంట్స్ చేసి ఇటీవలే న్యూస్ లో నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అశ్విన్. రోహిత్ గురించి అశ్విన్ మాట్లాడుతూ..”రోహిత్ శర్మ అద్భుతమైన వ్యక్తి. అతడు జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరిని అర్ధం చేసుకోగలడు. పైగా వారి బలాలు, బలహీనతలు కూడా తెలుసు. ప్లేయర్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా ఉపయోగించుకోవాలో హిట్ మ్యాన్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. ఇక జట్టు వ్యూహాలను ప్రతీ ఒక్క ప్లేయర్ తో పంచుకుంటాడు. ఇది అతడి నాయకత్వ లక్షణానికి మచ్చు తునక. ఇక అతడు తన బ్యాట్ తో సెంచరీలు చేస్తూ.. ముందు సాగుతాడు” అంటూ రోహిత్ ను ఆకాశానికి ఎత్తేశాడు రవిచంద్రన్ అశ్విన్.

ప్రస్తుతం అశ్విన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. గతంలో చాలా సార్లే రోహిత్ ను అశ్విన్ పొగిడినప్పటికీ ఇలా ప్రశంసించడం చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. సౌతాఫ్రికా టూర్ కోసం టీమిండియా జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. ఈ టూర్ లో టెస్ట్ జట్టులో అశ్విన్ కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి హిట్ మ్యాన్ పై అశ్విన్ పొగడ్తలు కురిపించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి