మరికొన్ని గంటల్లో క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆసియా కప్ లో భాగంగా.. సెప్టెంబర్ 2(శుక్రవారం) ఇండియా-పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ గురించి ఇప్పటికే క్రీడా పండితులు, దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు తమతమ అభిప్రాయాలను వెళ్లిబుచ్చారు. ఇదంతా ఒకెత్తు అయితే.. టీమిండియా జట్టుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. 2011 నుంచి వస్తున్న భారత జట్టులో ప్రస్తుతం ఉన్న టీమ్ అత్యంత బలమైన జట్టు అని ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
గత కొంతకాలంగా టీమిండియాలోకి ఎంతో మంది నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు వస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టులోకి ఎంతో మంది యంగ్ టాలెంట్ వచ్చి చేరింది. దీంతో ఎవరిని సెలెక్ట్ చేయాలి? అన్నది కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దిగ్గజ ఆటగాడు రవిశాస్త్రి. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..”2011 నుంచి ఇప్పటి వరకు నేను చూసిన టీమిండియా జట్టులో ప్రస్తుతం ఉన్న జట్టు అత్యుత్తమ జట్టు. ఈ జట్టుకు అపారమైన అనుభవం ఉన్న సారథి ఉన్నాడు. అతడికి ఎలా ఆడాలో.. ఆటగాళ్లను ఎలా ఆడించాలో తెలుసు. వరల్డ్ క్రికెట్ లో మిగతా ఆటగాళ్ల, సారథుల కంటే అతడికి ఎక్కువగా తెలుసు” అని చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి.
ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, గిల్, ఇషాన్ కిషన్, జడేజా, జైస్వాల్, రుతురాజ్, షమీ, బుమ్రా, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అశ్విన్, చాహల్, కుల్దిప్ లాంటి ఎంతో టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో యువ రక్తం కూడా టీమిండియాకు తోడవ్వడంతో.. టీమ్ ఇంకా స్ట్రాంగ్ గా మారింది. ఈ క్రమంలోనే రవిశాస్త్రి ఈ కామెంట్స్ చేశాడు. మరి రవిశాస్త్రి అన్నట్లుగా 2011 నుంచి వస్తున్న టీమ్ లో ఇదే అత్యుత్తమ టీమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ravi Shastri said, “this is India’s strongest team since 2011. They have a captain who is seasoned, who understands the terrain better than most”. (Espncricinfo). pic.twitter.com/cmZFu6a7Pw
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 1, 2023