iDreamPost

టెస్టులకు ఆ స్టార్ ఆల్ రౌండర్ పనికిరాడు: రవిశాస్త్రి

  • Author Soma Sekhar Published - 04:58 PM, Mon - 26 June 23
  • Author Soma Sekhar Published - 04:58 PM, Mon - 26 June 23
టెస్టులకు ఆ స్టార్ ఆల్ రౌండర్ పనికిరాడు: రవిశాస్త్రి

టీమిండియా క్రికెట్ టీమ్ పై, సెలక్షన్ కమిటీపై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోవడమే. ఈ ఓటమితో టీమిండియా సెలక్షన్ కమిటీపై మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొంత మంది ఓ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ టెస్టులు ఆడితే బాగుంటుందని, అతడి అవసరం టెస్టుల్లో టీమిండియాకు ఉందని మాజీ లెజెండ్ సౌరవ్ గంగూలీ కూడా అభిప్రాయ పడ్డాడు. అయితే ఆ ఆల్ రౌండర్ టెస్టులకు పనికిరాడని తేల్చిచెప్పాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. మరి టెస్టులకు పనికిరాని ఆ ఆల్ రౌండర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా క్రికెట్ లో ఓ ఆటగాడు ఫలానా ఫార్మాట్ కు మాత్రమే పనికొస్తాడు అని మనం చెప్పలేం. కానీ కొంత మంది క్రికెటర్ల తీరు చూస్తే.. ఇతడు ఈ ఫార్మాట్ కే పనికొస్తాడు.. ఇంకో ఫార్మాట్ కు కష్టమే అనిపిస్తుంది. దానికి ఉదాహరణగా సూర్యకుమార్ యాదవ్ నే తీసుకోవచ్చు. టీ20ల్లో చిచ్చర పిడుగులా చెలరేగే సూర్య.. వన్డేలు, టెస్టులకు వచ్చే సరికి నిరాశపర్చడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే రవిశాస్త్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు టీమిండియా క్రికెట్ లో ఆసక్తిని రేపాయి.

ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్ కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పనికిరాడని తేల్చిచెప్పాడు రవిశాస్త్రి. అతడు తన కెరీర్ లో చాలా సమయాన్ని గాయాలకే వేస్ట్ చేశాడని గుర్తుచేశాడు. పాండ్యా శరీరం టెస్టు క్రికెట్ ను తట్టుకోలేదు. అది అతడి వల్ల కాదు అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అయితే అతడు వన్డేలకు, టీ20లకు సరిగ్గా సెట్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ వరకు రోహిత్ కెప్టెన్ గా కొనసాగుతాడని, ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ పగ్గాలు పాండ్యాకే దక్కుతాయని జోస్యం చెప్పాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను తిరుగులేని జట్టుగా నడిపించిన అనుభవం పాండ్యా సొంతం. పైగా ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా చేస్తూ.. రోహిత్ నుంచి మెలకువలు నేర్చుకుంటున్నాడు కూడా. దాంతో అతడికే సారథి పగ్గాలు ఇస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి