iDreamPost

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ ఆటను మళ్లీ ఆగం చేయాలని పూనుకున్న రతిక!

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఏం చేసినా కూడా అది వారి స్వప్రయోజనం కోసమే అవుతుంది. అంతేగానీ, మంచితనం, ఎదుటువాళ్ల ఆట మెరుగవ్వాలి అనే కోణంలో ఎవరూ ఏం చేయరు. ఇప్పుడు రతికా రోజ్ మరోసారి ప్రశాంత్ తో ఫ్రెండ్ షిప్ అంటోంది అంటే ఆ మాట వెనకాల చాలా పెద్ద స్ట్రాటజీనే ఉంది.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఏం చేసినా కూడా అది వారి స్వప్రయోజనం కోసమే అవుతుంది. అంతేగానీ, మంచితనం, ఎదుటువాళ్ల ఆట మెరుగవ్వాలి అనే కోణంలో ఎవరూ ఏం చేయరు. ఇప్పుడు రతికా రోజ్ మరోసారి ప్రశాంత్ తో ఫ్రెండ్ షిప్ అంటోంది అంటే ఆ మాట వెనకాల చాలా పెద్ద స్ట్రాటజీనే ఉంది.

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ ఆటను మళ్లీ ఆగం చేయాలని పూనుకున్న రతిక!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చాలా విషయాల్లో ఉల్టా పుల్టాగానే ఉంటోంది. మరీ ముఖ్యంగా.. ఈ సీజన్ లో ట్రాకులు అనేవి అస్సలు లేవని చాలామంది తెగ ఫీలైపోతున్నారు. అంతే కాకుండా ప్రతివారం ఇంటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతున్నారు అంటూ తెగ గోల పెట్టేస్తున్నారు. ఈ రెండింటికి ఒకే వారం ఆన్సర్ దొరికినట్లు అయింది. అంటే హౌస్ నుంచి ఈ వారం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు అనే లీకులు రావడం చూస్తున్నాం. అలాగే హౌస్ లో ప్రశాంత్ తో తిరిగి ఫ్రెండ్ షిప్ చేయడం కోసం రతికా రోజ్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే మరో కొత్త ట్రాక్ ఏదో రాబోతోంది అంటున్నారు.

హౌస్ లో మొదటివారంలోనే బాగా క్లోజ్ అయినవాళ్లు.. లవ్ ట్రాక్ అని ప్రచారం జరిగిన జంట ఏదైనా ఉంది అంటే అది ప్రశాంత్- రతికా రోజ్ అనే చెప్పాలి. వీళ్లు హౌస్ మొత్తం తెగ తిరిగేశారు. వేరేవాళ్లతో కలవడం లేదంటూ వీళ్లని నామినేట్ కూడా చేశారు. అలాంటిది ఆ తర్వాత రతికా రోజ్ ప్లేట్ ఫిరాయించింది. అసలు ఎవడ్రా నువ్వు అనేంత వరకు వెళ్లింది. ఏదోలే అని చనువిస్తే చంకనెక్కుతావా అంటూ గోల గోల చేసింది. అక్కడితో ఆగకుండా ఇంట్లో వాళ్లను కూడా తిట్టేసింది. ఆ తర్వాత ఆమెకు వచ్చిన నెగిటివిటీ వల్ల హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. బయటకు వచ్చిన తర్వాత రతికా రోజ్ కు అసలు ఆట అర్థమైంది. తన క్యారెక్టర్ ఎంత బ్యాడ్ అయ్యిందో చూసుకుంది. వెంటనే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన తప్పులను దిద్దుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.

అందులో భాగంగా మొదట శివాజీని మంచి చేసుకుంది. ఆ తర్వాత తన టార్గెట్ పల్లవి ప్రశాంత్ అనే చెప్పాలి. అందుకే ప్రశాంత్ తో కలిసిపోయే ప్రయత్నాలు చేసింది. హౌస్ నుంచి వెళ్లే సమయంలో కనీసం ప్రశాంత్ ముఖం కూడా చూడలేదు రతికా రోజ్. కానీ, ఇప్పుడు మాత్రం తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రశాంత్ చూడటం లేదు. అందుకే యావర్ తో పంచాయితీ పెట్టించింది. బతిమాలితే గానీ మాట్లాడట్లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రశాంత్ ని రతికా అని పిలువు చాలు.. అక్క అనద్దు అంటూ కామెంట్ చేసింది. ప్రశాంత్ మాత్రం నేను అక్కా అనే పిలుస్తాను అప్పుడు అలా అని ఇప్పుడు ఇంకోలా పిలవాలి అంటే నాతోని కాదు అంటూ తెగేసి చెప్పాడు. కానీ, రతికా రోజ్ మాత్రం సర్దిచెంప్పేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. నాపై అప్పుడున్న ఫీలింగ్స్ అన్నీ ఏమైపోయాయి? హార్ట్ ఎక్స్ ఛేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు గలీజ్ పదంతో పిలుస్తావా? అంటూ ప్రశ్నించింది. నువ్వు నన్ను ఎన్ని తిట్టిన నేను తీసుకునే వాడిని కానీ, నువ్వు మాత్రం నా తల్లిదండ్రులను తిట్టావ్ అంటూ చెప్పుకొచ్చాడు.

నేను ఇలాగే ఉంటాను అంటూ సారీ చెప్పేసి వెళ్లిపోయాడు. ఆ తర్వతా శివాజీకి జరిగింది చెప్పాడు. శివాజీ వీళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఆమెకు ఇష్టం లేనప్పుడు ఎందుకు పిలవడం వద్దు వదిలేయ్. పాతవి తవ్వుకోవద్దు అంటూ హితవు చెప్పాడు. నిజానికి ప్రశాంత్ అలా చెప్పడం ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. రతికాను అస్సలు క్షమించద్దు అనుకున్నారు. కానీ, శివాజీ వచ్చి ప్రశాంత్ ఆటను బద్నాం చేసినట్లు అయింది. రతికాతో చేతులు కలిపించాడు. కన్నీళ్లు పెట్టుకుంటూనే ప్రశాంత్- రతికాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మనోడు రతికా విషయంలో స్ట్రాంగ్ గా ఉండి ఉంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ వచ్చేది. మరి.. ప్రశాంత్ చేసిన పని అతని ఆటపై ఎంత మేర ప్రభావం చూపుతుందో చూడాలి. మరి.. ప్రశాంత్- రతికాల ఫ్రెండ్ షిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి