iDreamPost

Rashmika Mandanna: వాళ్ల పరిస్థితి తలచుకుంటే భయంగా ఉంది.. రష్మిక ఎమోషనల్ కామెంట్స్!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఎమోషనల్ అయ్యారు. వాళ్ల పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉందన్నారు. ఆమె ఎవర్ని ఉద్దేశించి ఇలా మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఎమోషనల్ అయ్యారు. వాళ్ల పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉందన్నారు. ఆమె ఎవర్ని ఉద్దేశించి ఇలా మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం..

Rashmika Mandanna: వాళ్ల పరిస్థితి తలచుకుంటే భయంగా ఉంది.. రష్మిక ఎమోషనల్ కామెంట్స్!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సూపర్ ఫామ్​లో ఉంది. ఆమె నటించిన ‘యానిమల్’ మూవీ గతేడాది ఆఖర్లో రిలీజై బ్లాక్​బస్టర్​గా నిలిచింది. కొన్నాళ్లు సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన రష్మికకు ‘యానిమల్’ మంచి ఊరటను కలిగించింది. ఈ సినిమా ఇచ్చిన జోష్​లో తదుపరి చిత్రాలపై ఆమె ఫుల్ ఫోకస్ పెడుతోంది. ఇక, గతేడాది నవంబర్​లో వైరల్ అయిన రష్మిక డీప్ ఫేక్ వీడియో ఇండియాలో విపరీతమైన సంచలనం రేపిన విషయం తెలిసిందే. తెగ వైరల్ అయిన ఈ డీప్ ఫేక్ వీడియోతో సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇతరత్రా సమాజంలో కూడా అందరూ షాకయ్యారు. చాలా మంది రష్మికను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడంతో ఆమెకు కొంతవరకూ ఉపశమనం కలిగి, ఊపిరి పీల్చుకోగలిగింది.

అప్పట్లో డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ లాంటి బడా వ్యక్తులు కూడా ప్రతిస్పందించారు. ఆ వీడియోని క్రియేట్ చేసిన వ్యక్తి పైన యాక్షన్ తీసుకోవాలని పబ్లిక్​గానే మాట్లాడారు. ఇంత రియాక్షన్ వచ్చేసరికి, పోలీసులు కూడా సీరియస్​గానే స్పందించి, వీడియో క్రియేటర్​ను గత నెలలో అరెస్టు చేశారు. దీంతో ఈ వివాదానికి అక్కడ ఫుల్​స్టాప్ పడింది. కానీ, ఆ వీడియో వల్ల రష్మిక మాత్రం మానసికంగా చాలా ఇబ్బంది పడింది. ఇబ్బంది పడడమే కాదు, అటువంటి వీడియోలు సమాజాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాయోనని ఆమె విచారంలో కూడా మునిగిపోయింది. ‘యానిమల్’ సినిమా వరల్డ్ వైడ్ సాధించిన గ్రేట్ సక్సెస్​తో రష్మిక చాలా పాపులర్ కావడంతో ఆ వీడియో అందరినీ బాగా అటెన్షన్​లోకి తీసుకొచ్చింది.

rashmika mandana interview

ఈ మధ్య ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వూలో రష్మిక అటువంటి వీడియోల గురించి తన ఫీలింగ్స్​ను ఎక్స్​ప్రెస్ చేసింది. ఇటువంటి వీడియోలు సమాజాన్ని ఉద్రిక్తతకు గురి చేస్తాయని తెలిపింది. సోషల్ మీడియా యాక్టివిటీ బాగా పెరిగిపోవడం ద్వారా ఇటువంటి పరిస్థితులు ఆడవాళ్లను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాయని కూడా ఆమె అబిప్రాయపడింది. ఇదే కాలేజీలో చదువుతున్నప్పుడు జరిగి ఉంటే అందరి సపోర్ట్ దొరికి ఉండేదని.. ఇటువంటి కెరీర్స్​లో ఉన్నవాళ్లకు ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే మాత్రం నిజంగా అంత గడ్డు పరిస్థితి మరొకటి ఉండదని రష్మిక ఫీలైంది. ఆడపిల్లల పరిస్థితి గురించి తలుచుకుంటేనే చాలా భయంగా ఉందని చెప్పింది.

ఇటువంటి డిస్టర్బింగ్ యాక్టివిటీస్​ను అరికట్టకపోతే ఆడవాళ్లకు భద్రతే ఉండదని వాపోయింది. నిజానికి రష్మిక సెలబ్రిటీ స్టేటస్​ను సాధించింది కాబట్టి, అమితాబ్​తో పాటు పలువురు రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారు. కానీ సమాజంలో ఇటువంటి అసాంఘికమైన వ్యవహారం పెద్దమొత్తంలోనే నడుస్తోందన్నది అందరినీ కలవరపరుస్తున్న మాటైతే నిజం. ఇలాంటి ఫేక్ వీడియోలు అలియా భట్​తో పాటు మరికొందరి మీద కూడా వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఒకటో అరో మాత్రమే అటెన్షన్​ను క్యాచ్ చేస్తున్నాయి. మరి.. డీప్​ ఫేక్​ వివాదంపై రష్మిక చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి